దర్భంగా పేలుళ్ల కేసులో సంచలన విషయాలు.. వెలుగులోకి వచ్చిన సీసీటీవీ దృశ్యాలు!

|

Jun 30, 2021 | 5:14 PM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్భంగా పేలుళ్ల కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. రైలును పేల్చివేసేందుకు కుట్ర పన్నిన నిందితుల..

దర్భంగా పేలుళ్ల కేసులో సంచలన విషయాలు.. వెలుగులోకి వచ్చిన సీసీటీవీ దృశ్యాలు!
Crime News
Follow us on

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్భంగా పేలుళ్ల కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. రైలును పేల్చివేసేందుకు కుట్ర పన్నిన నిందితుల సీసీటీవీ విజువల్స్‌ బయటికొచ్చాయి. ఇండియన్‌ ముజాహిదీన్‌ తీవ్రవాదులు పెద్ద మొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టానికి కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్‌లో ఉంటూ పేలుళ్లకి కుట్ర పన్నిన ఇద్దరు నిందితులను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది. వారినిపుడు విచారిస్తున్నారు.

దేశంలో ఉగ్ర కార్యకలాపాలు ఎక్కడ జరిగినా మూలాలు హైదరాబాద్‌లో బయటపడుతున్నాయి. తాజాగా జూన్ 17న బీహార్‌లోని దర్భంగా రైల్వే స్టేషన్‌లో జరిగిన పేలుళ్ల కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. బీహార్‌ నుంచి వచ్చి హైదరాబాద్‌లో మకాం వేశారు ఇమ్రాన్, నాసిర్. సూఫియాన్‌ అర్షద్ పేరుతో సికింద్రాబాద్‌లో పార్సిల్‌ బుకింగ్ చేశారు. ఆ సమయంలోనే దుస్తుల మధ్యలో బాంబులు అమర్చి పార్సిల్‌ను రైల్లో పంపారు. దీంతో ఒక్కసారిగా దర్భంగా రైల్వేస్టేషన్‌లో ఉండగా ఈ బాంబులు పేలాయి. అయితే అప్పటికే పరారీలో ఉన్న అర్షద్‌ దొరికితే కుట్రకోణం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు పోలీసులు.

దర్భంగా పేలుడు వెనుక ఉగ్ర కు‌ట్ర దాగి ఉందని, రసాయనం ద్వారా రైలులో అగ్నిప్రమాదంతో భారీ విధ్వంసం సృష్టించాలనే లక్ష్యంతో నిందితులు ప్లాన్ చేసుకున్నట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. ఇక నిందితులు ఇచ్చిన సమాచారంతో వారి బ్యాంకు ఖాతాలు చెక్ చేస్తే పేలుళ్లకు ముందు భారీ నగదును వారి ఖాతాల్లో క్రెడిట్ అయినట్లు తేలింది. ఈ నగదు బదిలీ చేసిన వారు ఎవరు అనే కోణంలో లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: 

ఈ ఫోటోలో మరో చిరుత దాగుంది.. కనిపెట్టగలరా! గుర్తు పట్టలేదా.? అయితే ఈ క్లూ ట్రై చేయండి..

బిర్యానీ ఇలా కూడా చేస్తారా! నెటిజన్లు ఫిదా.. వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే!