
ఇటీల ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, పబ్జీ లాంటి వాటిలో ఇతరులతో ప్రేమలో పడి వారికోసం దేశాన్ని విడిచి వెళ్లిపోతున్న ఘటనలు జరుగుతున్నాయి. సీమా హైదర్ అనే మహిళ పాకిస్థాన్ నుంచి యూపీలో ఉన్న తన ప్రియుడి కోసం రావడం.. పోలాండ్ నుంచి మరో మహిళ జార్ఖండ్ రావడం లాంటి ఘటనలు వెలుగుచూశాయి. తాజాగా అంజు అనే భారత మహిళ కూడా ఫేస్‌బుక్‌లో పరిచయైన తన ప్రియుడి కోసం పాకిస్థాన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన విషయంపై ఆ పాకిస్థాన్ యువకుడు నస్రుల్లా (29) స్పందించాడు. భారత్ నుంచి తనను కలుసుకోవడానికి వచ్చిన అంజును పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని పేర్కొన్నాడు.
తమ మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని చెప్పాడు. ఆమె తన వీసా గడువు ముగిశాక ఆగస్టు 20న భారత్‌కు తిరిగి వెళ్లనుందని చెప్పాడు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన అంజు పాకిస్థాన్ సందర్శనకు వచ్చింది. మా ఇంట్లోని ఆడవారితో కలిసి ఆమె ప్రత్యేక గదిలో ఉంటోందని.. జిల్లా యంత్రాంగం కూడా తమకు భద్రత కల్పించిందని పేర్కొన్నాడు. చివరికి మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదని భారత వార్త సంస్థకు ఫోన్‌లో స్పష్టం చేశాడు. మరోవైపు అంజు కూడా దీనిపై స్పందించింది. నస్రుల్లాను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో తాను పాకిస్థాన్ రాలేదని.. మీడియా అనవసరంగా రాద్దాంతం చేస్తోందని తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.