Jyoti Malhotra: భారత్ ఏజెంట్లను గుర్తించేందుకు ఐఎస్‌ఐకు సహాయం.. జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి సంచలనాలు!
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గూఢచర్యం కేసులో పట్టుబడిన ఆమెను ప్రశ్నిస్తున్న ఎన్‌ఐఏ దర్యాప్తులో తాజాగా సంచలన విషయాలు బయటపడ్డాయి. అయితే పాకిస్తాన్ గూఢచార సంస్థ అయిన ఐఎస్ఐ భారత రహస్య ఏజెంట్లను గుర్తించడానికి జ్యోతి మల్హోత్రా సహాయపడినట్టు తెలుస్తోంది. ఎన్‌ఐఏ దర్యాప్తులో ఈ విషయాలు వెల్లడైనట్టు కొన్ని జాతీయ మీడియాలు పేర్కొన్నాయి.

పాకిస్తాన్‌కు తరపున గూఢచర్యం చేసిన కేసులో అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ప్రస్తుతం ఐదు రోజుల పోలీసుల కస్టడీలో ఉంది. హర్యాణా పోలీసులతో పాటు ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో బృందం సంయుక్తంగా ఈమెను విచారిస్తున్నారు. అయితే దర్యాప్తులో ఇప్పటికే వీరు ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలను రాబట్టారు. యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా చెప్పుకున్న జ్యోతి ఇప్పటికి వరకు మూడు సార్లు పాకిస్తాన్ వెళ్లొచ్చినట్టు గుర్తించారు. అయితే ఈమె కాశ్మీర్ పర్యటన తర్వాత పాకిస్తాన్ వెళ్లడంతో పహల్గామ్ ఉద్రాడితో ఈమెకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో ఎన్‌ఐఏ అధికారులు విచారిస్తున్నారు.
ఎన్‌ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో, హర్యాణా పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ గూఢచార సంస్థ అయిన ఐఎస్ఐ భారత రహస్య ఏజెంట్లను గుర్తించడానికి జ్యోతి మల్హోత్రాను వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. జ్యోతి మల్హోత్రా, ఐఎస్ఐ నిర్వాహకుడు అలీ హసన్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌లను దర్యాప్తు అధికారులు గుర్తించినట్టు తెలిపారు. భారతదేశ రహస్య కార్యకలాపాలకు సంబంధించిన కోడెడ్ సంభాషణలు వారిద్దరి మధ్యన జరినట్టు భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఓక మెసెజ్‌లో అసన్ జ్యోతిని ఇలా అడిగాడు.. అట్టారీ బోర్డర్‌కు వెళ్లినప్పుడు ఎవరైనా అండర్ కవర్ ఏజెంట్ల..స్పెషల్ ప్రోటోకాల్ అందుకోవడం గమనించారా అని అడిగినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి.
ప్రోటోకాల్, “అండర్ కవర్ ఏజెంట్” వంటి పదాలను కోడ్ భాషలో ఉపయోగించడం వల్ల, భారతీయ ఏజెంట్ల నిఘా సమాచారాన్ని సేకరించడానికి ISI ఆమెను ఉపయోగిస్తున్నట్లు ఏజెన్సీలు అనుమానించాయి. ప్రోటోకాల్ ఎవరికి వస్తుందనేది తెలుసుకుంటే..రహస్య ఏజెంట్లను ఈజీగా గుర్తించవచ్చని హసన్ జ్యోతికి చెప్పినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అయితే హసన్ అగిన ప్రశ్నకు బదులుగా జ్యోతి సమాధానం చెబుతూ తాను ఎవరినీ గుర్తించలేదని.. అయినా వారు అంత తెలివితక్కువ వారు ఏం కాదు అని చెప్పినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే వీరి మధ్య సంభాషణను బట్టి చూస్తే, జ్యోతి ఉద్దేశపూర్వకంగానే భారత ఏజెంట్ల వివరాలను ఐఎస్ఐకు చేరవేయాలని చూసిందనే నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
