‘ఆ ‘దేవదూత’ నా ప్రశ్నలకు సమాధానం చెబుతారా’ ? పి. చిదంబరం

| Edited By: Anil kumar poka

Aug 29, 2020 | 12:24 PM

కరోనా పాండమిక్, జీఎస్టీపై దాని ప్రభావం 'దేవుడి చర్యే'నంటూ ఆర్ధిక  మంత్రి నిర్మలాసీతారామన్ చేసిన వ్యాఖ్యపై మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం సెటైరిక్ గా స్పందించారు. ఆమెను 'దేవదూత' గా వ్యంగ్యంగా విమర్శిస్తూ..

ఆ దేవదూత నా ప్రశ్నలకు సమాధానం చెబుతారా ? పి. చిదంబరం
Follow us on

కరోనా పాండమిక్, జీఎస్టీపై దాని ప్రభావం ‘దేవుడి చర్యే’నంటూ ఆర్ధిక  మంత్రి నిర్మలాసీతారామన్ చేసిన వ్యాఖ్యపై మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం సెటైరిక్ గా స్పందించారు. ఆమెను ‘దేవదూత’ గా వ్యంగ్యంగా విమర్శిస్తూ.. కోవిడ్ సంక్షోభం తలెత్తకముందు దేశ ఆర్థిక వ్యవస్థపట్ల ప్రభుత్వం పాటించిన ‘ మిస్ మేనేజ్ మెంట్’  విధానాలను కూడా ఆమె వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. 2017,18. 19, 20 సంవత్సరాల్లో అంటే ఈ కరోనా రాక ముందు ఎకానమీని మేనేజ్ చేయడంలో మీరు (ప్రభుత్వం) విఫలమయ్యారని చిదంబరం ఆరోపించారు. దీనికి మీ నుంచి సమాధానాన్ని ఆశిస్తున్నానన్నారు.

2019 జనవరి-మార్చి త్రైమాసికంలో జీడీపీ వృద్ది రేటు 3.1 శాతం ఉందని తాను గత మే నెలలోనే చెప్పానని చిదంబరం పేర్కొన్నారు. ఆర్ధిక బాధ్యతల నుంచి కేంద్రం తప్పించుకోజాలదన్నారు. ఇది చట్ట ఉల్లంఘనే అవుతుందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ కూడా ఆయనతో ఏకీభవించారు.