Covid-19 Vaccine: భారత్‌లో 108 కోట్లు దాటిన కోవిడ్‌ టీకాలు.. రాష్ట్రాల్లో నిల్వ ఉన్న డోసులు.. కేంద్రం ట్వీట్‌

|

Nov 07, 2021 | 6:04 AM

Covid-19 Vaccine: గత ఏడాదికిపైగా వణికించిన కరోనా మహమ్మారి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కేసులు తగ్గిపోయాయి. కరోనా కట్టడికి..

Covid-19 Vaccine: భారత్‌లో 108 కోట్లు దాటిన కోవిడ్‌ టీకాలు.. రాష్ట్రాల్లో నిల్వ ఉన్న డోసులు..  కేంద్రం ట్వీట్‌
Follow us on

Covid-19 Vaccine: గత ఏడాదికిపైగా వణికించిన కరోనా మహమ్మారి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కేసులు తగ్గిపోయాయి. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌తోపాటు ఇతర చర్యలు చేపట్టడం వల్ల కరోనా అదుపులోకి వచ్చింది. ఇక అతి తక్కువ సమయంలోనే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌.. దేశ వ్యాప్తంగా అందరికి వేసేలా చర్యలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇక కోవిడ్‌ డోసుల పంపిణీలో ఇప్పటికే వంద కోట్లకుపైగా చేరుకుంది. శనివారానికి కోవిడ్‌ టీకాల పంపిణీ సంఖ్య 108 కోట్లు దాటినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ట్వీట్‌ చేసింది. టీకా పంపిణీలో భాగంగా 74.09 కోట్లు మొదటి డోసు కాగా, 34,13 కోట్లు రెండో డోసుకు సంబంధించి ఉన్నాయి.

అలాగే ఇప్పటి వరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 116.54 కోట్లకుపైగా వ్యాక్సిన్‌ డోసులు ఉచితంగా సరఫరా చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద 15.69 కోట్లకుపైగా డోసులు నిల్వ ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసింది. ఆయా రాష్ట్రాల్ల టీకాల కొరత లేకుండా కేంద్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇక దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,43,44,683కు చేరగా, మరణాల సంఖ్య 4,60,265కు చేరుకుంది.

 

ఇవి కూడా చదవండి:

Vaccination: భారత వ్యాక్సినేషన్‌ ప్రస్థానంలో అద్భుతం.. 125 ఏళ్ల వృద్ధుడికి విజయవంతంగా రెండు డోస్‌ల వ్యాక్సిన్‌..

Coronavirus: డెల్టా వేరియంట్‌ కలకలం.. న్యూజిలాండ్‌లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు..