ఆరెంజ్ పండ్ల వ్యాపారికి ‘పద్మశ్రీ’ .. పేదరికానికి పెద్ద ‘బహుమతి’

దక్షిణ కర్నాటకలో అది ఓ చిన్న గ్రామం.. ..  న్యూపదపు అన్న ఈ గ్రామంలో ఓ పేద వ్యాపారిని అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ‘ పద్మశ్రీ ‘ అవార్డు  వరించిందంటే నమ్మలేం.. కానీ అటవీ అధికారి పర్వీన్  కస్వాన్ మాత్రం ఈ ఆరెంజ్ పండ్ల వ్యాపారికి  ఈ అవార్డు దక్కిందని అంటున్నారు. హరేకల హజబ్బా అనే ఈ వ్యాపారి తన గ్రామంలోని ఓ మసీదులో పదేళ్లుగా పేద పిల్లలకు చదువు నేర్పించే చిన్నపాటి స్కూలు వంటిది నిర్వహిస్తున్నాడట.. […]

ఆరెంజ్ పండ్ల వ్యాపారికి 'పద్మశ్రీ' .. పేదరికానికి పెద్ద 'బహుమతి'
Follow us

| Edited By: Srinu

Updated on: Jan 28, 2020 | 2:09 PM

దక్షిణ కర్నాటకలో అది ఓ చిన్న గ్రామం.. ..  న్యూపదపు అన్న ఈ గ్రామంలో ఓ పేద వ్యాపారిని అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ‘ పద్మశ్రీ ‘ అవార్డు  వరించిందంటే నమ్మలేం.. కానీ అటవీ అధికారి పర్వీన్  కస్వాన్ మాత్రం ఈ ఆరెంజ్ పండ్ల వ్యాపారికి  ఈ అవార్డు దక్కిందని అంటున్నారు. హరేకల హజబ్బా అనే ఈ వ్యాపారి తన గ్రామంలోని ఓ మసీదులో పదేళ్లుగా పేద పిల్లలకు చదువు నేర్పించే చిన్నపాటి స్కూలు వంటిది నిర్వహిస్తున్నాడట.. తాను చదువుకోకపోయినా తనకొచ్ఛే చిరు సంపాదనతోనే దీన్ని నిర్వహిస్తున్నాడని, చదువు పట్ల ఇతని ఆసక్తి ఇప్పటికీ చెక్కు చెదరలేదని ఆయన పేర్కొంటున్నారు.

గతంలో ఓ విదేశీ జంట తనను ఏదో చిరునామా గురించి ప్రశ్నించగా వారి భాష అర్థం కాక..  సమాధానం చెప్పలేక హరేకల హజబ్బా మధనపడిపోయాడని ఆయన తెలిపారు.కొంత వరకు తుళు భాష మాత్రమే వచ్ఛే ఈ వ్యాపారికి అప్పటినుంచే పేద పిల్లలకు చదువు నేర్పించే సౌకర్యం కల్పించాలని నిర్ణయించుకున్నాడని అన్నారాయన..రేషన్ షాపులో క్యూలో నిలుచున్న హరికలాకు ఈ అవార్డు లభించిందన్న విషయాన్ని అధికారులు తెలిపారట. దీంతో ఇది కలా, నిజమా అని ఆయన నమ్మలేకపోయాడని తెలిసింది.