Indian Ports Bill 2021: ఆ బిల్లును వ్యతిరేకించండి.. వైఎస్ జగన్ సహా 8 తీర ప్రాంతాల సీఎంలకు స్టాలిన్ లేఖ..

| Edited By: Ravi Kiran

Jun 23, 2021 | 10:25 AM

CM MK Stalin: కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇండియన్‌ పోర్ట్స్‌ బిల్లు–2021 ముసాయిదాను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ బిల్లును తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా

Indian Ports Bill 2021: ఆ బిల్లును వ్యతిరేకించండి.. వైఎస్ జగన్ సహా 8 తీర ప్రాంతాల సీఎంలకు స్టాలిన్ లేఖ..
Tamilnadu Cm Mk Stalin Letter
Follow us on

CM MK Stalin: కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇండియన్‌ పోర్ట్స్‌ బిల్లు–2021 ముసాయిదాను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ బిల్లును తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. మైనర్‌ పోర్టుల విషయంలో రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేయాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. 8 తీరప్రాంత సీఎంలకు లేఖ రాశారు. చిన్నతరహా ఓడరేవులపై పెత్తనాన్ని మారిటైమ్‌ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌కు (ఎంఎస్‌డీసీ) కట్టబెట్టేలా కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్, వాటర్‌వేస్‌ మంత్రిత్వ శాఖ ఈ ముసాయిదా బిల్లును తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఈ అంశంపై రాష్ట్రాలతో చర్చించేందుకు ఎంఎస్‌డీసీ ఈ నెల 24న (గురువారం) సమావేశాన్ని తలపెట్టిందని పేర్కొన్నారు. దానిపై అభ్యంతరాలు వ్యక్తంచేయాలని కోరారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న ఇండియన్‌ పోర్ట్స్‌ యాక్ట్‌–1908 ప్రకారం.. మైనర్‌పోర్టుల ప్రణాళిక, అభివృద్ధి, క్రమబద్ధీకరణ, నియంత్రణ వంటివి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉన్నాయి. ఇకపై ఇలాంటి అధికారాలను ఎంఎస్‌డీసీకి బదిలీ చేయాలని కొత్త బిల్లులో ప్రతిపాదించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కేంద్ర ప్రభుత్వం లాక్కుంటోందని స్టాలిన్‌ ఆరోపించారు. రాష్ట్రాలకు నష్టం చేకూర్చేలా ఉన్న ఈ బిల్లుపై అభ్యంతరాలను కేంద్రానికి తెలియజేయాలని కోరారు.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డితో సహా గుజరాత్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఈ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందితే చిన్నతరహా ఓడరేవుల విషయంలో ఇక రాష్ట్రాలకు ప్రాధాన్యమైన పాత్ర ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గళం వినిపించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Also Read:

పంజాబ్ కాంగ్రెస్ లో అసమ్మతి చిచ్చు… చిక్కుల్లో సీఎం అమరేందర్ సింగ్ ..నాయకత్వ మార్పు తప్పదా …?

నా కష్ట కాలంలో బీజేపీ మౌనం నన్ను బాధిస్తోంది… లోక్ జన శక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ విచారం