Operation Sindoor: ప్రయాణికులకు అలర్ట్.. దేశవ్యాప్తంగా పలు ఎయిర్ పోర్టులు మూసివేత..! విమానాలు రద్దు..

ఆపరేషన్ సిందూర్ కింద భారతదేశం పాకిస్తాన్‌లోని జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా ప్రధాన కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుంది. ఆపరేషన్ సింధూర్‌తో అప్రమత్తమైన పాక్‌ సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడింది. దీంతో అప్రమత్తమైన భారత ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్ ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేసింది. కేవలం శ్రీనగర్ మాత్రమే కాదు..

Operation Sindoor: ప్రయాణికులకు అలర్ట్.. దేశవ్యాప్తంగా పలు ఎయిర్ పోర్టులు మూసివేత..! విమానాలు రద్దు..
Airports Closed

Updated on: May 07, 2025 | 9:54 AM

పహల్‌గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్‌ ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ విరుచుకుపడింది. పాకిస్థాన్‌లోని తొమ్మిది స్థావరాలపై మెరుపు దాడులు చేసింది భారత సైన్యం. అయితే అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గర్లోని ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే భారత్ టార్గెట్ చేసింది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ దూరంలోని బహవల్‌పూర్‌లో ఉన్న జైష్ ఏ మొహమ్మద్ ప్రధాన కార్యాలయం మురిడ్కే, సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కి.మీ దూరంలో ఉన్న లష్కరే క్యాంప్‌పై దాడి చేసింది. అయితే ఆపరేషన్‌ సిందూర్‌లో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఆపరేషన్ సింధూర్ కింద భారతదేశం పాకిస్తాన్‌లోని జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా ప్రధాన కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుంది. ఆపరేషన్ సింధూర్‌తో అప్రమత్తమైన పాక్‌ సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడింది. దీంతో అప్రమత్తమైన భారత ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్ ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేసింది. కేవలం శ్రీనగర్ మాత్రమే కాదు..సరిహద్దులకు సమీపంలో ఉన్న జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాల ఎయిర్‌పోర్టులను కూడా తాత్కాలికంగా మూసివేశారు. ఈ విమానాశ్రయాల ద్వారా వెళ్లే విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.  పాకిస్తాన్‌పై భారతదేశం వైమానిక దాడి చేసిన నేపథ్యంలో ఎయిర్ ఇండియా తన ప్రయాణీకులకు ఒక హెచ్చరిక జారీ చేసింది.

దీని ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు దేశవ్యాప్తంగా ఎయిర్ ఇండియా విమానాలు రద్దు చేశారు.. ఇండిగో, స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్ కూడా తమ విమానాలను రద్దు చేసుకున్నాయి. తదుపరి ప్రకటన వచ్చేవరకు ఉత్తర భారతదేశంలోని విమానాశ్రయాలు మూసివేయబడతాయని ప్రకటించాయి.

పాకిస్తాన్- పిఓకెలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడుల తర్వాత ఎయిర్ ఇండియా, ఇండిగో ఎయిర్‌లైన్స్, స్పైస్ జెట్ ప్రయాణీకులకు ముఖ్య ప్రకటన చేశాయి.. సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా ఎయిర్‌లైన్స్‌ ప్రయాణీకులు విమానాశ్రయానికి చేరుకోవటానికి ముందుగానే ఈ ప్రకటన గమనించాలని అభ్యర్థించింది. ఈ మేరకు బికనీర్, శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాల సహా అనేక నగరాలకు విమానాలు రద్దు చేసినట్టుగా సోషల్ మీడియా పోస్ట్‌ ద్వారా ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..