AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Sindhoor: సైన్యంలో చేరి.. తండ్రి మరణానికి పాక్ పై ప్రతీకారం తీర్చుకుంటా అంటున్న జవాన్ కూతురు

ఉగ్రవాదుల పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ లోని పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు పాకిస్తాన్ సైన్యం భారత దేశంలో దాడులు చేసిది. ముఖ్యంగా బోర్డర్ వద్ద ప్రాంతాల్లో డ్రోన్స్ తో విరుచుకు పడింది. అయితే భారత వాయుసేన ఈ దాడులను చాక చక్యంగా తిప్పి కొట్టింది. ఇలాంటి సందర్భంలో ఒక డ్రోన్ శకలం తగిలి రాజస్థాన్ కు చెందిన సార్జెంట్ సురేంద్ర మోగా వీరమరణం పొందారు. తండ్రి అంత్యక్రియల సందర్భంగా సురేంద్ర కుమార్తె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Operation Sindhoor: సైన్యంలో చేరి.. తండ్రి మరణానికి పాక్ పై ప్రతీకారం తీర్చుకుంటా అంటున్న జవాన్ కూతురు
Surendra Singh Mogas Daughter Vartika
Surya Kala
|

Updated on: May 12, 2025 | 1:52 PM

Share

శనివారం ఉధంపూర్ వైమానిక స్థావరంపై పాకిస్తాన్ డ్రోన్ దాడి చేసినప్పుడు.. అక్కడ విధి నిర్వహణలో ఉన్న సురేంద్ర సింగ్ మోగా ప్రాణాలు కోల్పోయాడు. డ్రోన్ శకలాలు తగిలి అమరుడైన సైనికుడు సురేంద్ర కుమార్ భౌతికకాయానికి ఆదివారం రాజస్థాన్‌లోని జుంజును జిల్లాలోని ఆయన స్వగ్రామంలో సైనిక గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించారు. దేశ రక్షణ చేస్తూ తన ప్రాణాలు పోగొట్టుకున్న సైనికుడికి కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలతో పాటు భారీ సంఖ్యలో ప్రజలు కూడా అశ్రు నయనాలతో తుది వీడ్కోలు పలికారు.

భారత వైమానిక దళంలో అసిస్టెంట్ మెడికల్ సార్జెంట్ అయిన సురేంద్ర కుమార్, ఉధంపూర్ వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్ లోని మాండవా నుంచి అతని గ్రామం మెహ్రదాసి వరకు ‘తిరంగ యాత్ర’ నిర్వహించి.. రోడ్డు మార్గం ద్వారా అతని మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకుని వెళ్ళారు. ఈ ఊరేగింపులో వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు.

రాజస్థాన్‌లోని ఝుంఝును నివాసి అయిన సురేంద్ర మోగా, భారత వైమానిక దళంలో మెడికల్ అసిస్టెంట్ సార్జెంట్‌గా పనిచేస్తున్నాడు. సురీందర్ కుమార్ మోగాకి తల్లి, భార్య, 11 ఏళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

సురేంద్ర కుమారుడు దక్షుడు తండ్రి చితికి నిప్పంటించాడు. ప్రభుత్వ లాంఛనాలతో అమరవీరుడు సురేంద్ర కుమార్ అంత్యక్రియలు జరిగాయి. వేలాది మంది ప్రజలు అంత్యక్రియలకు హాజరై ” భారత్ మాతా కీ జై “, “సురేంద్ర కుమార్ అమర్ రహే” నినాదాలు చేశారు. తన భర్త మృతదేహం దగ్గర నిలబడి సురేంద్ర భార్య వణుకుతున్న చేతితో సెల్యూట్ చేస్తూ “ఐ లవ్ యు” అని పదే పదే అరిచింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి అవినాష్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రి ప్రేమ్‌చంద్ బైర్వా, ఝబర్ సింగ్ ఖర్రా సహా అనేక మంది నాయకులు సురేంద్ర మృత దేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.

కాగా సురేంద్ర అంత్యక్రియల సమయంలో సురేంద్ర 11 ఏళ్ల కుమార్తె వృతిక తన తండ్రి ధైర్యసాహసాల గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇది కదా భరత మాత ముద్దుబిడ్డ దైర్యసహసాలు అని గర్వంగా కామెంట్స్ చేస్తున్నారు. తన తండ్రిని “దేశ రక్షకుడు” అని అభివర్ణించింది. “అంతా బాగానే ఉందని.. తాను సురక్షితంగా ఉన్నారని నాన్న చెప్పారు. కానీ దేశాన్ని రక్షించడానికి మా నాన్న ప్రాణాలను అర్పించారు. తన తండ్రి దేశాన్ని కాపాడుతూ అమరుడైనందుకు గర్వపడుతున్నానని బాలిక తెలిపింది. పాకిస్తాన్ మొత్తం నాశనం కావాలి. తాను కూడా తన తండ్రిలాగే సైన్యంలో చేరతానని.. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాను” అని చిన్నారి వృతిక కన్నీటి మధ్య శబధం చేసింది. సైన్యంలో చేరి దేశానికి హాని చేసే శత్రువులను అంతం చేస్తానంటూ ప్రతిజ్ఞ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..