Operation Sindoor: భారత్‌ ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాలు ఇవే.. ఎక్కడెక్కడ ఉన్నాయంటే?

మన ఆడబిడ్డల శోకానికి... చిన్నారుల ఆక్రందనలకు.. కుటుంబాల గుండెకోతకు..సమాధానం దొరికింది. రివేంజ్‌ ఓ రేంజ్‌లో చూపించాయి మన బలగాలు. ఇద్దరు ధీర వనితల ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్‌ సింధూర్‌.. ముష్కరుల గుండెల్లో మిసైళ్లను దింపింది. నిద్రలేని రాత్రులకు కాళరాత్రిగా మిగిల్చింది. ముష్కర క్యాంపులు, వారికి సహరిస్తున్న వారి భరతం పట్టింది. సింధూ నది ప్రవహించే ప్రాంతాల్లో జరిగిన ఈ ఆపరేషన్‌ సింధూర్‌.. సింధూరాలు కోల్పోయిన మన ఆడపడచుల కన్నీటిని తుడిచింది. ఇల్లే ఇండియా.. దిల్లే ఇండియా అంటోంది మన భారతం. రాత్రి నుంచే యువత రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. ఇది పర్ఫెక్ట్‌ మిషన్‌ అంటూ ప్రధాని మోదీనే ప్రకటించారు. కొన్ని ఏళ్లుగా ముష్కర మూకలు చేస్తున్న కల్లోలాలకు గట్టి సమాధానమే ఆపరేషన్‌ సిందూర్‌.

Operation Sindoor: భారత్‌ ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాలు ఇవే.. ఎక్కడెక్కడ ఉన్నాయంటే?
India Attacked Places

Updated on: May 07, 2025 | 5:44 PM

ఇది సిందూర్ మాత్రమే కాదు.. సిన్‌-డోర్‌ కూడా. అంటే పాపాత్ములపై తెరుచుకున్న మృత్యుద్వారాలే ఈ సిన్‌-డోర్‌. పహల్గాంలో చనిపోయిన 26మంది ఆత్మలకు ఇప్పుడు శాంతి చేకూరుతుంది. తలలో కాల్చారు.. గుండెల్లో కాల్చారు, మోకాళ్లపై కూర్చోబెట్టి కాల్చారు.

POK అండ్‌ పాకిస్తాన్‌లోని తొమ్మిది ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. ఆ తొమ్మది కూడా ఉగ్ర క్యాంపులకు స్థావరాలుగా ఉన్నాయి. ఆ స్థావరాలు ఓసారి తెలుసుకుందాం.

  • 1. తొలి స్ట్రైక్‌ మర్కజ్‌ సువానల్లా, బహవల్పూర్‌లో జరిగింది.
  • 2. మర్కజ్‌ తయ్యబా, మురిద్కే
  • 3. సర్జల్‌, టెహ్రాకలాన్‌
  • 4. మహమూనా జోయా సువిధా, సియాల్‌కోట్‌
  • 5. మర్కజ్‌ అహ్లే హదీస్‌ బర్నాలా, భింబర్‌
  • 6. మర్కజ్‌ అబ్బాస్‌, కోట్లీ
  • 7. మస్కర్‌ రహీల్‌ షాహిద్‌, కోట్లీ
  • 8. షావాయి నాలా క్యాంప్‌, ముజఫరాబాద్‌
  • 9. సయ్యద్నా బిలాల్‌ క్యాంప్‌, ముజఫరాబాద్‌

ఈ తొమ్మది టార్గెట్స్‌ అన్నీ ముష్కర స్థావరాలే. ముష్కరుల రిక్రూట్‌మెంట్‌, ట్రైనింగ్‌, ఆపరేషనల్‌ స్కిల్స్‌ నేర్పిస్తున్న ఈ స్థావరాలు ఇప్పుడు ధ్వంసమయ్యాయి. దాదాపు వందమంది ముష్కరులను మట్టుబెట్టాయి మన సేనలు. ఆపరేషన్‌ సింధూర్‌పై పాకిస్తాన్‌ ఇప్పుడు ఆర్తనాదాలు చేస్తోంది. తమ బిడ్డలు చనిపోయారంటూ కన్నీరు పెడుతోంది. నిజమే ఉగ్రవాదులే మీ బిడ్డలు. మీది ఓ ఉగ్రదేశం అంటూ సెటైర్లు పేలుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి