Video: ఆపరేషన్ సిందూర్‌పై స్పందించిన రవి శంకర్! ఏమన్నారంటే..?
భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ పై శ్రీశ్రీ రవిశంకర్ స్పందించారు. ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ లోని ఉగ్రవాద కేంద్రాలపై దాడి చేయడం సరైనదని, దేవుళ్ళు కూడా ఒక చేతిలో ఆయుధం, మరో చేతిలో పువ్వు పట్టుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన విషయం తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా.. పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకొని.. భారత్ ఈ ప్రతి దాడి చేసింది. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై ఈ దాడులు నిర్వహించినట్లు ఇండియన్ ఆర్మీ, నేవీ ప్రతినిధులు సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ తెలిపారు. అయితే.. తాజాగా ఈ ఆపరేషన్ సిందూర్‌పై శ్రీశ్రీ రవిశంకర్ గురుజీ స్పందించారు. మాటలతో చెప్పినప్పుడు వినకుంటే చేతలో సమాధానం చెప్పాలని ఇప్పుడు భారత్ అదే చేసిందని అన్నారు. మన దేవుళ్లు కూడా ఒక చేతిలో ఆయుధం మరో చేతిలో పువ్వు పట్టుకొని ఉంటారని అన్నారు. సామాన్య ప్రజలకు హాని కలగకుండా భారత్ కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే దాడి చేసిందని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

