BJP vs Congress: ఒకవైపు తిరంగా.. మరోవైపు జైహింద్‌.. సైనికులకు మద్దతుగా పోటాపోటీ ర్యాలీలు

ఆపరేషన్‌ సింధూర్‌ చుట్టూ పొలిటికల్‌ మైలేజ్ హైడ్రామా జరుగుతోంది. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత 100మంది టెర్రరిస్టుల్ని మట్టుబెట్టి.. పాకిస్తాన్‌కి గుణపాఠం నేర్పామని.. ఇది ఎన్డీఏ ప్రభుత్వ ఘనత అన్నట్టుగా బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటుంటే.. అసలెందుకు ట్రంప్‌ జోక్యం చేసుకున్నాడో చెప్పాలంటూ ప్రజల్లోకి వెళ్తోంది కాంగ్రెస్‌..

BJP vs Congress: ఒకవైపు తిరంగా.. మరోవైపు జైహింద్‌.. సైనికులకు మద్దతుగా పోటాపోటీ ర్యాలీలు
Bjp Vs Congress

Updated on: May 20, 2025 | 8:59 AM

ఆపరేషన్ సింధూర్ సూపర్‌ సక్సెస్‌ తర్వాత సైనికులకు సంఘీభావంగా తిరంగా యాత్రలకు శ్రీకారం చుట్టింది బీజేపీ. ఇప్పటికే దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహిస్తూ ఇండియన్‌ ఆర్మీకి మద్దతు పలుకుతోంది. అయితే, బీజేపీకి పోటీగా జైహింద్‌ ర్యాలీలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్‌. ఆపరేషన్‌ సింధూర్‌, కాల్పుల విరమణ ఒప్పందంపై పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపర్చాలని డిమాండ్‌ చేస్తోన్న కాంగ్రెస్‌.. జైహింద్‌ పేరిట సైనికులకు సంఘీభావం తెలపాలని నిర్ణయించింది.

ఆపరేషన్‌ సింధూర్‌ను బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడుతోంది కాంగ్రెస్‌. ముఖ్యంగా భారత్‌-పాకిస్తాన్‌ కాల్పుల వివరణపై ట్రంప్‌ ప్రకటన తర్వాత ప్రధాని మోదీ మౌనం వహించడాన్ని నిరసిస్తూ ర్యాలీలు చేపడతున్నట్టు వెల్లడించింది. అంతేకాదు, దేశానికి చెందిన సైనిక సత్తాను తమ ఘనతగా బీజేపీ ప్రమోట్‌ చేసుకుంటోందని మండిపడుతోంది. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత రెండుసార్లు అఖిలపక్ష భేటీ జరిగితే ఒక్కసారి కూడా మోదీ రాలేదని, దీనిపైనా జైహింద్‌ ర్యాలీల్లో ప్రశ్నిస్తామంటోంది కాంగ్రెస్‌. ఆపరేషన్‌ సింధూర్‌కి ముందు-తర్వాత కూడా కేంద్రానికి ఖర్గే, రాహుల్‌ మద్దతు ప్రకటించినా.. బీజేపీ మాత్రం పొలిటికల్‌ మైలేజ్‌ కోసం ప్రయత్నించడమేంటని నిలదీస్తోంది. ఇప్పటికైనా ఆపరేషన్‌ సింధూర్‌పై రాజకీయం చేయడం బీజేపీ ఆపాలని డిమాండ్‌ చేస్తోంది.

ఒకవైపు సైనికులకు మద్దతుగా సంఘీభావం తెలుపుతూ.. మరోవైపు ట్రంప్‌ ప్రకటన తర్వాత మోదీ మౌనాన్ని ప్రశ్నించడమే తమ ర్యాలీల లక్ష్యమంటోంది కాంగ్రెస్‌. కేంద్రం నుంచి సమాధానం వచ్చేవరకు జైహింద్‌ ర్యాలీలు చేస్తామంటోంది. అలాగే.. పహల్గామ్‌ ఉగ్రదాడి, ఆపరేషన్‌ సింధూర్‌, కాల్పుల విరమణపై చర్చిద్దామంటే.. ఎందుకు పార్లమెంట్‌ను సమావేశపర్చడం లేదని అడుగుతోంది కాంగ్రెస్‌.

మొత్తానికి, ఆపరేషన్‌ సింధూర్‌ చుట్టూ పొలిటికల్‌ మైలేజ్ హైడ్రామా జరుగుతోంది. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత 100మంది టెర్రరిస్టుల్ని మట్టుబెట్టి.. పాకిస్తాన్‌కి గుణపాఠం నేర్పామని.. ఇది ఎన్డీఏ ప్రభుత్వ ఘనత అన్నట్టుగా బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటుంటే.. అసలెందుకు ట్రంప్‌ జోక్యం చేసుకున్నాడో చెప్పాలంటూ ప్రజల్లోకి వెళ్తోంది కాంగ్రెస్‌..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..