
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రజలంతా ఆగ్రహంతో ఊగిపోయారు. పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్రవాదుల అంతాన్ని ప్రతీ ఒక్కరు కోరుకున్నారు. భారత సేన.. పాక్ ఆర్మీ, వారి ఉగ్రమూకలపై ప్రతీకారాన్ని తీర్చుకుంది. దానిపేరే ఆపరేషన్ సింధూర్. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశం మొత్తం ఒకటే ఎమోషన్. శత్రువినాశనం ఎప్పుడు? భారత ప్రభుత్వం, రక్షణ శాఖ, భద్రతాదళాలు కూడా ప్రత్యర్థిపై ఎలా రివేంజ్ తీర్చుకోవాలన్న ఆలోచనలో పడ్డారు. అప్పుడు ఉద్భవించిందే ఆపరేషన్ సింధూర్. భారత ఆర్మీ, వాయుసేన కలిసి రచించిన ఈ శత్రువినాశ అధ్యాయం.. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. పక్కాగా మన దళాలు పాక్ టార్గెట్లను చేధిస్తే.. ఆతర్వాత పాక్ రిటాలియేషన్‌ను మన వ్యవస్థలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. అసలు ఎలా సాగింది ఆపరేషన్ సింధూర్ తెలుసుకుందాం.. ఆపరేషన్ సింధూర్‌తో భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. ముఖ్యంగా కవ్వింపుల పాక్‌కు సమాధానం దొరికింది. దీంతో యుద్ధం మొదలుపెట్టకముందే పాక్‌ని ఓడించాయి భారత సేనలు. పాక్ మిసైళ్లను నేలమట్టం చేశారు. డ్రోన్లను బూడిద చేశారు. జెట్స్‌ను కూల్చేశారు. ఎయిర్‌బేస్‌లను పేల్చేశారు. ఇది కదా అసలైన విజయం. మే9 అర్ధరాత్రి పాకిస్తాన్ భారత్‌పై తెగబడడం భారత్ కచ్చితత్వంతో తిప్పికొట్టడం జరిగింది. స్వర్ణ దేవాలయంపై దాడికి యత్నం..! పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయంపై దాడి చేస్తారన్న సమాచారంతో మన సేనలు దేవాలయాన్ని చుట్టుముట్టారు. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంపై ఈగ కూడా వాలకుండా చూసుకున్నాయి. స్వర్ణదేవాలయాన్ని కూల్చాలని చూశారు. ప్రజలను చావాలని కోరుకున్నారు. LOCలో విధ్వంసం సృష్టించాలని ప్లాన్స్...