India Corona: అక్కడ పెరుగుతున్నా భారత్ లో తగ్గుతున్నాయ్.. మరోసారి రెండు వేలకు దిగువనే కొత్త కేసులు

|

Mar 23, 2022 | 12:13 PM

దేశంలో కొత్త కేసుల నమోదు ఊరట కలిగిస్తోంది. కొద్ది రోజులగా కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య రెండు వేలకు దిగువనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి మరోసారి ఆందోళనకు గురిచేస్తుండగా భారత్‌లో...

India Corona: అక్కడ పెరుగుతున్నా భారత్ లో తగ్గుతున్నాయ్.. మరోసారి రెండు వేలకు దిగువనే కొత్త కేసులు
Follow us on

దేశంలో కొత్త కేసుల నమోదు ఊరట కలిగిస్తోంది. కొద్ది రోజులగా కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య రెండు వేలకు దిగువనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి మరోసారి ఆందోళనకు గురిచేస్తుండగా భారత్‌లో (India) మాత్రం సానుకూల వాతావరణం కనిపిస్తోంది. మరణాలు కూడా 100లోపే ఉంటున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Department) గణాంకాలు వెల్లడించింది. మంగళవారం 6.77 లక్షల మందికి కరోనా(Corona) నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే.. 1,778 మందికి కరోనా సోకినట్లు తేలిందని వెల్లడించింది. వైరస్ నుంచి మరో 2,542 మంది కోలుకున్నారని పేర్కొంది. కొవిడ్ వ్యాప్తి అదుపులో ఉండటంతో బాధితుల సంఖ్య గణనీయంగా పడిపోతుందని వివరించింది. ప్రస్తుతం ఆ సంఖ్య 23,087కి తగ్గిపోయింది. దేశంలో ఇప్పటివరకు 4.30 కోట్ల మందికి కరోనా సోకగా..4.24 కోట్ల (98.75 శాతం) మంది కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 62 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 5.16 లక్షలు దాటింది. ఇప్పటి వరకూ 181 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయినట్లు కేంద్రం వెల్లడించింది.

దేశంలో కొవిడ్‌ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. భవిష్యత్తులో వైరస్‌లో మ్యుటేషన్లు సంభవిస్తాయని నిపుణులు చెప్పారు. ఇప్పటివరకు వెయ్యి మ్యుటేషన్లు జరిగినప్పటికీ వాటిలో కేవలం ఐదు మాత్రమే ఆందోళనకరమైనవని అన్నారు. వీటితోపాటు భవిష్యత్తులో కొత్త వేరియంట్‌లను పసిగట్టేందుకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌తో పర్యవేక్షిస్తూనే ఉండాలన్నారు.దేశంలో ఇప్పటికే 80 నుంచి 90శాతం ప్రజలు వైరస్‌ బారినపడ్డారని.. కొత్తవేవ్‌ వచ్చినప్పటికీ తీవ్ర లక్షణాలు ఉండకపోవచ్చని నిపుణులు వెల్లడించారు. అయినప్పటికీ కొత్త వేరియంట్‌లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉన్నందున నిర్లక్ష్యం వహించకూడదని వివరించారు. విదేశాల్లో నమోదవుతున్న కరోనా మరణాల్లో ఎక్కువ భాగం వ్యాక్సిన్‌ తీసుకోనివేనని స్పష్టం చేశారు.

Also Read

US President Biden: భారత్ భయపడుతోంది అన్న పెద్దన్న మాటలపై నష్టనివారణ చర్యలు ప్రారంభించిన అమెరికా

Telangana Govt Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. కానిస్టేబుల్ నుంచి గ్రూప్-1 వరకు ఉచిత శిక్షణ.. ఎక్కడ, ఎలా నమోదు చేసుకోవాలంటే?

Hyderabad: సికింద్రాబాద్‌ టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది దుర్మరణం