Visakhapatnam – Vijayawada route: రైల్వే లైనులో ఆధునీకరణ పనుల కారణంగా విశాఖపట్నం వెళ్ళే రైళ్ళ రద్దు..వివరాలు ఇవే..

|

Jun 21, 2021 | 2:26 PM

Visakhapatnam - Vijayawada route: దక్షిణ మధ్య రైల్వే కి చెందిన విశాఖపట్నం-విజయవాడ సెక్షన్‌లో తుని-గుల్లిపాడు స్టేషన్ల మధ్య భద్రతా సంబంధిత ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి.

Visakhapatnam - Vijayawada route: రైల్వే లైనులో ఆధునీకరణ పనుల కారణంగా విశాఖపట్నం వెళ్ళే రైళ్ళ రద్దు..వివరాలు ఇవే..
Train
Follow us on

Visakhapatnam – Vijayawada route: దక్షిణ మధ్య రైల్వే కి చెందిన విశాఖపట్నం-విజయవాడ సెక్షన్‌లో తుని-గుల్లిపాడు స్టేషన్ల మధ్య భద్రతా సంబంధిత ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా విశాఖపట్నం నుంచి విజయవాడ, గుంటూరు, లింగంపల్లి, కడపాలకు వెళ్లే కొన్ని రైళ్లను రైల్వే రద్దు చేసింది. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఆ ప్రకటనలో పేర్కొన్న ప్రకారం ఈ రూటులో పూర్తిగా రద్దయిన రైళ్ళ వివరాలు ఇలా ఉన్నాయి.

రైలు నం. 02717 విశాఖపట్నం-విజయవాడ స్పెషల్, 02718 విజయవాడ-విశాఖపట్నం ప్రత్యేక రైళ్లు జూన్ 28, 29, జూలై 5, 6 తేదీల్లో రద్దు చేశారు. ఇక గుంటూరు నుంచి బయలు దేరే రైలు నం. 07239 గుంటూరు-విశాఖపట్నం స్పెషల్, జూన్ 27, 28 మరియు 29 తేదీలలో మరియు జూలై 4, 5 మరియు 6 తేదీలలో రద్దు అయింది. అదేవిధంగా, విశాఖపట్నం నుంచి బయలు దేరే రైలు నం. 02831 విశాఖపట్నం-లింగంపల్లి స్పెషల్, జూన్ 27, 28, 29, జూలై 4, 5 , 6 తేదీలలోనూ. తిరిగి వచ్చే దిశలో, లింగంపల్లి నుంచి బయలుదేరాల్సిన 02832 లింగంపల్లి-విశాఖపట్నం స్పెషల్, జూన్ 28, 29,30 తేదీలలో జూలై 5, 6 , 7 తేదీల్లోనూ నిలిపివేస్తారు. రైలు నం. 07488 విశాఖపట్నం – కడప స్పెషల్, జూలై 3, 4, 5 మరియు 6 తేదీలలో అలాగే తిరిగి వచ్చే దిశలో, 07487 కడప-విశాఖపట్నం ప్రత్యేక రైలు, జూలై 4, 5, 6 మరియు 7 తేదీల్లోనూ రద్దవుతాయి. దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని చెబుతూనే, భద్రతా పనులు తప్పనిసరిగా చేయించాల్సిన పరిస్థితి దృష్ట్యా ప్రయాణీకులు సహకరించాలని కోరింది.
ఇదిలా ఉండగా కోవిడ్ – 19 దృష్టిలో పెట్టుకుని, పూరీ రథ యాత్ర రద్దీని నివారించడం కోసం కొన్ని రైళ్ళు ఖుర్దా రోడ్డు వద్ద నిలిపివేస్తున్నట్టు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కె. త్రిపాఠి తెలిపారు. ఆ రైళ్ళ వివరాలు ఇవీ..

పూరీ నుంచి బయలు దేరాల్సిన 08401 పూరి-ఓఖా ప్రత్యేక రైలు, జూన్ 27 నుండి జూలై 18 వరకు పూరీకి బదులుగా ఖుర్దా రోడ్ నుండి బయలుదేరుతుంది. అదేవిధంగా తిరుగు ప్రయాణంలోనూ 08402 ఓఖా- పూరి ప్రత్యేక రైలు జూన్ 23 నుండి జూలై 21 వరకు ఓఖా నుండి బయలుదేరుతుంది కానీ, పూరీ కి బదులుగా ఖుర్దా రోడ్ వద్ద నిలిపివేస్తారు.

పూరీ నుంచి బయలు దేరాల్సిన రైలు నం. 02843 పూరి-అహ్మదాబాద్ ప్రత్యేక రైలు, జూన్ 24 నుండి జూలై 23 వరకు మంగళవారం, గురువారం, శుక్రవారం మరియు శనివారం పూరీకి బదులుగా ఖుర్దా రోడ్ నుండి బయలు దేరుతుంది. అదేవిధంగా 02844 అహ్మదాబాద్-పూరి ప్రత్యేక రైలు, జూన్ 24 నుండి జూలై 19 వరకు సోమవారం, గురువారం, శనివారం మరియు ఆదివారం ఖుర్దా రోడ్డు వద్ద నిలిపివేయబడుతుంది. రైలు నం. 02063 పూరి-యశ్వంత్‌పూర్ ప్రత్యేక రైలు, జూన్ 25 నుండి జూలై 23 వరకు పూరీకి బదులుగా ఖుర్దా రోడ్ నుండి ప్రారంభమవుతుంది. 02064 యశ్వంత్‌పూర్-పూరి స్పెషల్, జూన్ 26 నుండి జూలై 17 వరకు ఖుర్దా రోడ్ వద్ద ఆగిపోతుంది.
అదేవిధంగా, రైలు నెం. 02859 పూరి- చెన్నై సెంట్రల్ స్పెషల్ రైలు జూన్ 27 న పూరీకి బదులుగా ఖుర్దా రోడ్ నుండి బయలు దేరుతుంది. 02860 చెన్నై సెంట్రల్- పూరి ప్రత్యేక రైలు జూన్ 28 న చెన్నై సెంట్రల్ నుండి బయలుదేరి ఖుర్దా రోడ్ వద్ద ఆగిపోతుంది. రైలు నం. 02973 గాంధీధామ్ – పూరి స్పెషల్ ఎక్స్‌ప్రెస్, జూన్ 23 నుండి జూలై 21 వరకు బుధవారాల్లో గాంధీధామ్ నుండి బయలుదేరుతుంది. ఖుర్దా రోడ్‌లో నిలిచి పోతుంది. 02974 పూరి-గాంధీధామ్ ప్రత్యేక రైలు జూన్ 26 నుండి జూలై 17 వరకు పూరీకి బదులుగా ఖుర్దా రోడ్ నుండి ప్రారంభమవుతుంది.

రైలు నెం .07479 పూరి-తిరుపతి ప్రత్యేక రైలు, సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం మరియు శనివారం అదేవిధంగా జూన్ 23 నుండి జూలై 21 వరకు పూరీకి బదులుగా ఖుర్దా రోడ్ నుండి బయలు దేరుతుంది. తిరుగు దిశలో, 07480 తిరుపతి- పూరి, సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం మరియు ఆదివారం, జూన్ 24 నుండి జూలై 23 వరకు తిరుపతి నుండి బయలుదేరి ఖుర్దా రోడ్ వద్ద ఆగిపోతుంది. ప్రయాణీకులు ఈ మార్పులను గమనించాలని ఆయన కోరారు.

Also Read: Income Tax Returns: కొత్త ఆదాయపు పన్ను పోర్టల్‌ లో 40 లోపాలు..ఆర్ధిక మంత్రికి ఫిర్యాదు చేసిన డీటీపీఏ

Gas Cylinder: మన గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ను ఇంటి నుంచే మార్చుకునే అవకాశం.. ఎలా.. ఎప్పటినుంచి.. తెలుసుకోండి!