Uttarakhand: నైనిటాల్ జిల్లాలో విరిగిపడిన కొండ చరియలు.. తృటిలో బస్సుకు తప్పిన ప్రమాదం

| Edited By: Phani CH

Aug 21, 2021 | 5:51 PM

ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ జిల్లాలో శుక్రవారం ఓ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.. 14 మంది ప్రయాణికులతో బస్సు వెళ్తుండగా కొద్ది దూరంలోనే కొండ చరియలు విరిగిపడడం ప్రారంభమైంది.

Uttarakhand: నైనిటాల్ జిల్లాలో విరిగిపడిన కొండ చరియలు.. తృటిలో బస్సుకు తప్పిన ప్రమాదం
Uttarakhand Landslide
Follow us on

ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ జిల్లాలో శుక్రవారం ఓ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.. 14 మంది ప్రయాణికులతో బస్సు వెళ్తుండగా కొద్ది దూరంలోనే కొండ చరియలు విరిగిపడడం ప్రారంభమైంది. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ బస్సును ఆపగానే కొందరు ప్రయాణికులు తమ లగేజీతో సహా కిందకు దిగి వెనక్కి పరుగులు తీశారు. బస్సు డ్రైవర్ కూడా వాహనాన్ని రివర్స్ గేర్ లో నడిపిస్తూ సురక్షిత ప్రదేశానికి చేర్చాడు. తమ కళ్ళ ముందే క్రమంగా కొండ చరియలు విరిగిపడడం చూసి అంతా షాక్ తిన్నారు. పగలు గనుక ముందే చూసినందున ఈ ప్రమాదం నుంచి బయటపడ్డామని, అదే రాత్రి అయితే ఎంత ఘోరం జరిగి ఉండేదోనని వీరు హడలిపోయారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. కాగా ఈ వీడియో వైరల్ అవుతోంది. ఉత్తరాఖండ్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 23 వరకు ఈ రాష్ట్రంతో బాటు బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, రాష్ట్రాల్లో చెదురుమదురు నుంచి భారీ వర్షాలు పడవచ్చునని ఈ శాఖ వెల్లడించింది.

ఈ నెలారంభంలో హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలో బండరాళ్లు, కొండచరియలు విరిగిపడి ఆ శిథిలాల్లోనే ఓ బస్సు, కొన్ని వాహనాలు చిక్కుకుపోవడంతో 25 మంది మరణించారు. 30 మందికి పైగా గల్లంతయ్యారు. కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ రాష్ట్రాలు భౌగోళికంగా చాలా సున్నిత ప్రాంతాలని.. ఏ మాత్రం వర్షాలు పడినా కొండచరియలు విరిగిపడడం సాధారణమని పర్యావరణ వేత్తలు అంటున్నారు. తరచూ సంభవించే భూకంపాలు కూడా ఇందుకు కారణమవుతున్నాయని వారు విశ్లేషించారు. అందువల్లే ఈ రాష్ట్రాలకు వచ్చే టూరిస్టులు, ప్రజలు కూడా వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను గుర్తుంచుకోవాలని వారు సూచిస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: సోషల్ మీడియాలో తాలిబన్లకు మద్దతుగా కామెంట్లు.. అస్సాంలో 14 మంది అరెస్ట్

Megastar Chiranjeevi: చిరంజీవి బర్త్ డే ట్రీట్ వచ్చేసింది.. టైటిల్ పోస్టర్ రిలీజ్..