గోవా, ముంబయి విమానాశ్రయాల్లో చివరి క్షణాల్లో విమానాలు రద్దు.. ప్రయాణికుల ఆందోళనలు

గోవా విమానశ్రయంలో ఆందోళనలు చెలరేగాయి. పది నిమిషాల్లో బయలుదేరాల్సిన గో ఏయిర్ విమానం రద్దైందనే విషయం చెప్పడంతో ప్రయాణికులు ఆగ్రహానికి గురయ్యారు.

గోవా, ముంబయి విమానాశ్రయాల్లో చివరి క్షణాల్లో విమానాలు రద్దు.. ప్రయాణికుల ఆందోళనలు
Flight

Updated on: Apr 13, 2023 | 2:03 PM

గోవా విమానశ్రయంలో ఆందోళనలు చెలరేగాయి. పది నిమిషాల్లో బయలుదేరాల్సిన గో ఏయిర్ విమానం రద్దైందనే విషయం చెప్పడంతో ప్రయాణికులు ఆగ్రహానికి గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే బుధవారం రోజున 2.10 AM గంటలకు గోవా నుంచి ముంబయికి బయలుదేరాల్సి ఉంది. కాని ప్రయాణికులకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా పది నిమిషాల ముందు అంటే 2.00 AM గంటలకు విమానం రద్దు అయినట్లు విమాన సిబ్బంది చెప్పడంతో ప్రయాణికులు వారితో వాగ్వాదానికి దిగారు. దాదాపు 80 మంది ప్రయాణికులు ఫ్లైట్ రద్దవ్వడంతో అక్కడే ఉండాల్సి వచ్చింది.

ప్రయాణికులు గో ఏయిర్ విమాన సిబ్బందితో వాగ్వాదం చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరో విమానం ఏర్పాటు చేసే వరకు ఏదైనా హోటల్‌కి తీసుకెళ్లాలని కూడా అడిగారు. చివరికి ఈ గందరగోళం అంతా ముగిసాక ఉదయం 6.30 AM గంటలకు మరో విమానాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే ముంబయి విమానశ్రయంలో కూడా గోవాకి వెళ్లాల్సిన గో ఏయిర్ విమానం రద్దు కావడంతో ప్రయాణికులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే కూర్చొని కొంతసేపు నిరసనలు కూడా చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.