Omicron vs Normal Cold Symptoms: కోవిడ్-19 ప్రారంభంలో ఏ సమస్య ఏర్పడిందో, ఇప్పుడు Omicron కాలంలో కూడా అదే సమస్య కనిపిస్తోంది. కరోనా ప్రారంభమైనప్పుడు, జలుబు, కోవిడ్-19 మధ్య తేడాను గుర్తించడం సాధ్యం కాదు. కానీ, దాని కేసులు పెరగడం ప్రారంభించి, ప్రభావాలు కనిపించడంతో తేలికపాటి జలుబు, చలి కూడా ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది.
ప్రస్తుతం Omicron విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఒమిక్రాన్ లక్షణాలకు మాములు జలుబు లక్షణాలు తేడాలను తెలుసుకుంటే భయాదోంళనలు ఉండవు. మేం మీ కోసం ఆ వ్యత్యాసాలను అందిస్తున్నాం. వీటిని తెలుసుకున్న తర్వాత ఒమిక్రాన్ పాజిటివ్‌గా ఉన్నారా లేదా చలికి గురయ్యారా అనేది మీరు సులభంగా తెలుసుకోవచ్చు.
ఏది ఏమైనా.. కొంచెం సందేహంగా ఉంటే మాత్రం కరోనా పరీక్ష తప్పక చేయించుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ ప్రారంభంలో తీసుకున్న ఉదాసీనత మీ మొత్తం కుటుంబాన్ని ముంచెత్తుతుంది. కాబట్టి ఒమిక్రాన్ సాధారణ జలుబు, ఫ్లూ నుంచి ఎలా భిన్నంగా ఉందో తెలుసుకుందాం.
Omicron లక్షణాలు..
ఇప్పటివరకు బయటకు వచ్చిన Omicron లక్షణాలపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఓ సారి చూద్దాం.
అలసట
కీళ్ళ నొప్పి
చలి
నిరంతర తలనొప్పి
గొంతు నొప్పి సమస్య లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.
COVID-19 నుంచి Omicron ఎంత భిన్నంగా ఉంటుంది?
ఇక్కడ పేర్కొన్న లక్షణాలను తెలుసుకుంటే, ఇవన్నీ కూడా కోవిడ్-19 లక్షణాలే అనే ప్రశ్న మీ మదిలోకి వస్తోంది. కాబట్టి, ఒమిక్రాన్ దాని నుంచి ఎలా భిన్నంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒమిక్రాన్ వైరస్ గొంతులో వృద్ధి చెందుతుంది. అయితే కోవిడ్-19 వైరస్ నేరుగా గొంతు లేదా ముక్కు ద్వారా ఊపిరితిత్తులపై దాడి చేస్తుంది.
ఒమిక్రాన్ వైరస్ ఊపిరితిత్తులను సజీవంగా ఉంచుతుంది. శ్వాస తీసుకోవడంలో ఎటువంటి సమస్య ఉండదు.
అయితే, కోవిడ్-19 వల్ల ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. శ్వాస తీసుకోవడంలోనూ చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి.
Omicron వస్తే ఆక్సిజన్ స్థాయి తగ్గదు. అయితే, కోవిడ్ -19 లో ఆక్సిజన్ కొరత కారణంగా, రోగులు, వారి కుటుంబాలు ఎంతో నరకం చూడాల్సి వచ్చింది.
సాధారణ జలుబు లక్షణాలు
సాధారణ జలుబులో, తలనొప్పి, ముక్కు కారటం ఉంటుంది.
తలలో తుమ్ముల భారంతో ఎక్కువగా నొప్పి కూడా వస్తుంది.
వేడి పదార్థాలు తాగిన తర్వాత ఉపశమనం ఉంటుంది. ఈ నొప్పి తలపై తప్ప శరీరంలోని ఇతర భాగాలపై ప్రభావం చూపదు.
సాధారణ జలుబులో, గొంతు నొప్పి ఉండదు. కానీ, ముక్కు లోపల పొడి లేదా జలదరింపు ఉంటుంది.
జలుబులో, మీరు అలసిపోయినట్లు అనిపించదు. కానీ చికాకుగా అనిపిస్తుంది.
Also Read: Health: ఈ లక్షణాలు పెద్దపేగు క్యాన్సర్‌కు సంకేతం కావొచ్చు.. ఎలా గుర్తించాలంటే..