Omicron Alert: ఆ దేశాల నుంచి వచ్చేవారు కచ్చితంగా ఈ రూల్స్ పాటించాల్సిందే.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు

|

Nov 30, 2021 | 9:22 AM

Omicron Virus Alert: ప్రపంచవ్యాప్తంగా కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే ఈ వేరియంట్‌ను దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో

Omicron Alert: ఆ దేశాల నుంచి వచ్చేవారు కచ్చితంగా ఈ రూల్స్ పాటించాల్సిందే.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు
Omicron Alert
Follow us on

Omicron Virus Alert: ప్రపంచవ్యాప్తంగా కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే ఈ వేరియంట్‌ను దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో గుర్తించారు. దీంతో పలు దేశాలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్రాలన్నీ కరోనా వేరియంట్‌పై పోరాడేందుకు సిద్ధంగా ఉండాలంటూ సూచనలు చేసింది. ఈ క్రమంలో పలు దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారా ఒమిక్రాన్‌ ఎఫెక్ట్ భారత్‌పై పడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇకపై ఇంటర్నేషనల్‌ ప్యాసింజర్లు కచ్చితంగా ఈ రూల్స్‌ పాటించాల్సిందేని స్పష్టం చేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఐరోపాతో పాటు, మరో 11 దేశాల నుంచి విమానాల్లో వచ్చే ప్రయాణికుల పరిశీలనకు మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆయా ప్రయాణికులంతా బయలు దేరడానికి ముందే స్వీయ ధ్రువీకరణ పత్రం, ఆర్‌టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ టెస్ట్‌ రిపోర్ట్‌ను అప్‌లోడ్‌ చేయాలని, వారు విమానంలో అడుగుపెట్టడానికి ముందే, నెగెటివ్‌ సర్టిఫికెట్‌ ఉందో లేదో విమానయాన సంస్థలు ధ్రువీకరించుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బయటపడిన నేపథ్యంలో, ముప్పు ఉన్నట్లు భావిస్తున్న దేశాల నుంచి వచ్చేవారికి ఈ నిబంధనలు వర్తిస్తాయని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు.

భారత్‌లో దిగిన తర్వాత విమానాశ్రయంలో ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్ట్‌ చేయించుకోవాలని, ఒకవేళ నెగెటివ్‌ వచ్చినా 7 రోజులపాటు హోం క్వారెంటైన్‌లో ఉండాలని మార్గదర్శకాలు జారీ అయ్యాయి. 8వ రోజు మరోసారి పరీక్ష చేయించుకోవాలని, అప్పుడు కూడా నెగెటివ్‌ వస్తే తర్వాత 7 రోజుల పాటు తమ ఆరోగ్యాన్ని సొంతంగా గమనిస్తూ ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఒకవేళ విమానాశ్రయంలో దిగిన వెంటనే చేసిన ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్ట్‌లో గానీ, 8వ రోజు చేసిన పరీక్షలో గానీ పాజిటివ్‌ వస్తే వారి నమూనాలను సూచించిన ల్యాబ్‌కు పంపాలని తేల్చిచెప్పింది కేంద్రం. పాజిటివ్ వచ్చిన వారిని ప్రత్యేక గదిలో ఉంచాలని, ఒమిక్రాన్‌ లేదని తేలితే డాక్టర్‌ సూచన మేరకు డిశ్ఛార్జ్ చేయొచ్చని మార్గదర్శకాల్లో వెల్లడించింది.

కొత్త వేరియంట్‌ సోకినట్లు తేలితే వారికి మళ్లీ నెగెటివ్‌ వచ్చేంతవరకూ విడిగా ఉంచి వైద్యం అందించాలని స్పష్టం చేసింది. బ్రిటన్‌ సహా ఐరోపా దేశాలు, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, బంగ్లాదేశ్‌, బోట్స్‌వానా, చైనా, మారిషస్‌, న్యూజిలాండ్‌, జింబాబ్వే, సింగపూర్‌, హాంకాంగ్‌, ఇజ్రాయిల్‌ దేశాల నుంచి వచ్చేవారికి ఈ నిబంధనలు వర్తించనున్నాయి.

రిస్క్ లేని దేశాల నుంచి వస్తే వారికీ RT-PCR పరీక్షలు చేయనున్నారు. ఎవరికైనా పాజిటివ్‌గా తేలిన వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపి, ఆ వ్యక్తిని క్వారంటైన్‌లో ఉంచుతారు.

రిస్క్ లేని దేశాల నుంచి వస్తున్న వారు, శాంపిల్స్‌లో నెగెటివ్ అని తేలినా.. కనీసం రెండు వారాల పాటు తమను తాము జాగ్రత్తగా పర్యవేక్షించుకోవాలని సూచించారు.

Also Read:

Bharat Biotech: ఇతర దేశాలకూ కొవాగ్జిన్.. ఎగుమ‌తులు ప్రారంభించిన భార‌త్ బ‌యోటెక్‌

Coronavirus: కరోనా హబ్‌గా వృద్ధాశ్రమం.. 67 మందికి పాజిటివ్.. కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటన..