రెజ్లర్ సాగర్ రానా పై దాడిలో ఒలంపిక్ రెజ్లర్ సుశీల్ కుమార్ మాస్టర్ మైండ్ అని ఢిల్లీ పోలీసులు శనివారం కోర్టుకు తెలిపారు. ఇతని పోలీసు కస్టడీని కోర్టు మరో నాలుగు రోజులు పొడిగించింది. మొదట ఇతడి కస్టడీని ఆరు రోజుల రిమాండుకు కోర్టు అనుమతించింది. అయితే సుశీల్ కుమార్, అతడి సన్నిహితుడు అజయ్ కుమార్ విచారణలో తమకు సహకరించడం లేదని పోలీసులు తెలిపారు. ఇతని అనుచరుడు అజయ్ కస్టడీని కూడా కోర్టు మరో 4 రోజులు పొడిగించింది. ఈ కేసులో వీరిద్దరూ పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని, వీరిని 7 రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఖాకీలు అభ్యర్థించారు. అయితే కోర్టు 4 రోజుల కస్టడీకి అనుమతించింది. సాగర్ రానాపై దాడిలో సుమారు 20 మంది పాల్గొని ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. సుశీల్ కుమార్ మొబైల్ ఇప్పటివరకు ఖాకీలకు లభించలేదు. అయితే సుశీల్, ఇతని సన్నిహితుడు అజయ్ లకు చెందిన ఏడు కార్లను మాత్రం వారు స్వాధీనం చేసుకున్నారు. కాగా రానాపై సుశీల్ ఎటాక్ కు సంబంధించిన వీడియోను వారు స్వాధీనం చేసుకోగలిగారు.
తమకు గ్యాంగ్ స్టర్లతో సంబంధం లేదని ఈ రెజ్లర్ చెబుతుండగా అది అబద్దమని కూడా పోలీసులు తెలుసుకున్నారు. జాతేధీ అనే గ్యాంగ్ స్టర్ తమ్ముడు ప్రదీప్ తో సుశీల్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఇదివరకే వార్తలు వచ్చ్చాయి.. ఓ కేసులో అతడికి సహకరించేందుకు సుశీల్ సోనిపట్ జిల్లాకు వెళ్ళాడట.. ఈ వివరాలన్నిటినీనీ పోలీసులు తమ కేసు డాక్యుమెంట్లలో పేర్కొన్నారు.
మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ :కర్నూలులో మరో రెండు వజ్రాలు లభ్యం..వర్షం పడితే వజ్రాలే.. జోరందుకున్న వేట : Diamonds In Kurnool Video