ఈశాన్య ప్రాంతంలో శాశ్వత శాంతి నెలకొల్పేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న అవిశ్రాంత ప్రయత్నాలకు కొత్త అధ్యాయం చేరింది. మణిపూర్‌లోని సాయుధ తీవ్రవాద సంస్థ UNLF హింసను విడిచిపెట్టి ప్రధాన జనజీవన స్రవంతిలో చేరడానికి అంగీకరించిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ మేరకు యుఎన్‌ఎల్‌ఎఫ్ శాంతి ఒప్పందంపై సంతకం చేసిందని ఆయన చెప్పారు. ఈమేరకు ట్విట్టర్ x సోషల్ మీడియా వేదికగా కొన్ని చిత్రాలను పంచుకున్నారు. బుధవారం న్యూఢిల్లీలో యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (UNLF) శాంతి ఒప్పందంపై సంతకం చేసిందని అమిత్ షా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి ట్వీట్ చేస్తూ, మణిపూర్ లోయ ఆధారిత సాయుధ సమూహం UNLF హింసను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో చేరడానికి అంగీకరించింది. ప్రజాస్వామ్య ప్రక్రియలకు స్వాగతిస్తున్నాను. శాంతి, పురోగమన మార్గ ప్రయాణంలో శుభాకాంక్షలు. అని షా అన్నారు.
మరో పోస్ట్‌లో, హోం మంత్రి ఇలా రాసుకొచ్చారు, “ఈ రోజు భారత ప్రభుత్వం మణిపూర్ ప్రభుత్వం యుఎన్‌ఎల్‌ఎఫ్‌తో సంతకం చేసిన శాంతి ఒప్పందం ఆరు దశాబ్దాల సాయుధ ఉద్యమానికి ముగింపు పలికింది. సమ్మిళిత అభివృద్ధి, ఈశాన్య భారతదేశంలోని యువతకు మంచి భవిష్యత్తును అందించాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజన్‌ను సాకారం చేయడంలో ఇది ఒక చారిత్రాత్మక విజయం“. అని అమిత్ షా పేర్కొన్నారు.
A historic milestone achieved!!!
Modi govt’s relentless efforts to establish permanent peace in the Northeast have added a new chapter of fulfilment as the United National Liberation Front (UNLF) signed a peace agreement, today in New Delhi.
UNLF, the oldest valley-based armed… pic.twitter.com/AiAHCRIavy
— Amit Shah (@AmitShah) November 29, 2023
యుఎన్‌ఎల్‌ఎఫ్‌తో పాటు అనేక ఇతర తీవ్రవాద సంస్థలను హోం మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. నిషేధం విధించిన కొన్ని రోజుల తర్వాత ఈ శాంతి ఒప్పందం కుదిరింది. మణిపూర్‌లో భద్రతా బలగాలు, పోలీసులు, పౌరులపై దాడులు, హత్యలతో పాటు భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు విఘాతం కలిగించే కార్యకలాపాలలో ఈ సంస్థ ప్రమేయం ఉందని కేంద్రం భావించింది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 24, 1964న ఏర్పాటైన మణిపూర్‌లో యుఎన్‌ఎల్‌ఎఫ్ పురాతన మైతే తిరుగుబాటు గ్రూపు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…