Shocking: దారుణ ఘటన.. వెండి కడియాల కోసం వృద్ధురాలి కాళ్లు నరికేశారు
కొందరిలో ఉన్మాదం రోజురోజుకు పెరిగిపోతుంది. అడవి జంతువుల కంటే క్రూరంగా దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా వెండి కడియాల కోసం వృద్ధురాలి కాళ్లు నరికేశారు దుండగులు.
వీళ్లను క్రూరులు అనాలా..? ఉన్నాదులు అనాలా..? లేదా రాక్షసులు అనాలా..? వెండి కడియాల కోసం వృద్ధురాలి కాళ్లు నరికేశారు దుండగులు. రాజస్థాన్(Rajasthan)లో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. బూండిలోని నైన్‌వాన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. తన పొలంలో నివసిస్తున్న ఓ వృద్ధురాలిపై అర్థరాత్రి సమయంలో దాడి చేశారు దుండగులు. కాలికున్న వెండి కడియాలు రాకపోవడంతో పాదాలు నరికి మరీ వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితురాలు నైన్‌వాన్‌లోని ఓ జర్నలిస్ట్ తల్లిగా గుర్తించారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం కోటా ఆస్పత్రికి తరలించారు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇలాంటి ముఠాలు గురించి తమ వద్ద సమాచారం ఉందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులను పట్టుకుని.. కఠినమైన కేసులు ఫైల్ చేస్తామని చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..