AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Triple Talaq: భార్యకు ట్రిపుల్ తలాక్.. భర్త చెప్పిన కారణం తెలిస్తే మైండ్ బ్లాంక్..

సమాజంలో వివాహ (Marriage) వ్యవస్థ చులకనగా మారిపోయింది. జీవితాంతం తోడుగా జీవించాల్సిన భార్యాభర్తలు చిన్న చిన్న కారణాలకే విడిపోతున్నారు. అవి ఎలా ఉంటున్నాయంటే.. విడిపోవడానికి ఇవి కారణాలేనా అని అనిపిస్తాయి...

Triple Talaq: భార్యకు ట్రిపుల్ తలాక్.. భర్త చెప్పిన కారణం తెలిస్తే మైండ్ బ్లాంక్..
Triple Talaq
Ganesh Mudavath
|

Updated on: Sep 02, 2022 | 10:54 AM

Share

సమాజంలో వివాహ (Marriage) వ్యవస్థ చులకనగా మారిపోయింది. జీవితాంతం తోడుగా జీవించాల్సిన భార్యాభర్తలు చిన్న చిన్న కారణాలకే విడిపోతున్నారు. అవి ఎలా ఉంటున్నాయంటే.. విడిపోవడానికి ఇవి కారణాలేనా అని అనిపిస్తాయి. ముఖ్యంగా ట్రిపుల్ తలాక్ విషయంలో పలువురు చెప్పే రీసన్స్ సిల్లీగా అనిపిస్తాయి. కూరలో ఉప్పు వేయలేదని, చపాతీలు మాడిపోయాయని, ఇంటిని శుభ్రంగా ఉంచుకోలేదని ఇలా పలు సాకులు చెప్పి ట్రిపుల్ తలాక్ చెప్పేస్తున్నారు. వివాహ బంధానికున్న గొప్పతనాన్ని దిగజారుస్తున్నారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరఠ్‌ లో ఇలాంటి అమానవీయ ఘటనే జరిగింది. భార్య లావు అయిందని, బరువు పెరిగిపోయిందని ఓ వ్యక్తి తన భార్యకు ట్రిపుల్‌ తలాక్‌ (Tripel Talaq) చెప్పాడు. ఊహించని పరిణామానికి షాక్ అయిన బాధితురాలు.. తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. తన భర్తపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేసింది. తనకు ఎనిమిదేళ్ల క్రితం పెళ్లయిందని, ఏడెళ్ల కుమారుడు ఉన్నాడని వివరించింది. నెల రోజుల క్రితం తనను భర్త ఇంటి నుంచి గెంటివేశాడని, లావు అయ్యావని ట్రిపుల్ తలాక్ చెప్పాడని కన్నీటిపర్యంతమైంది. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మూడు సార్లు ‘తలాక్’, ‘తలాక్’, ‘తలాక్’ అని చెప్తే విడాకులు ఇచ్చేసినట్లే. ఈ అంశంపై ముస్లిం మహిళలు సుప్రీం కోర్టులో భారీగా పిటిషన్లు వేశారు. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధం అంటూ 2017 ఆగస్టులో పేర్కొంది. ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తూ ప్రధాని మోడీ ప్రభుత్వం లోక్‌సభలో 2018 డిసెంబర్ 27వ తేదీన ఆమోదం తెలిపింది. నిబంధనలను అతిక్రమిస్తే మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా ఉంటుంది.

కాగా.. ట్రిపుల్ తలాక్‌ను చాలా ముస్లిం దేశాలు నిషేధించాయి. ట్రిపుల్ తలాక్ చెప్పడం నేరంగా పరిగణిస్తున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ, సిప్రస్, ట్యునీషియా, మలేషియా, ఇరాన్, శ్రీలంక, జోర్డాన్,అల్జీరియా, ఇండోనేషియా, యూఏఈ, ఖతార్, సుడాన్, మొరొకో, ఈజిప్ట్, ఇరాక్, బ్రూనేలాంటి దేశాలు నిషేధించాయి. తాజాగా ఈ జాబితాలో ఇండియా చేరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

Follow Us
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..