Train Accidents: గత 40 ఏళ్లలో దేశంలో జరిగిన ఘోర రైలు ప్రమాదాలివే.. అతి పెద్ద ప్రమాదం ఏదంటే?

|

Jun 03, 2023 | 11:32 AM

Coromandel Express Train Accident: ఒడిశాలో శుక్రవారం రాత్రి 7.15 గంటలకు బహనాగ స్టేషన్ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో చోటు చేసుకుంది. ప్రమాదంలో 278 మంది చనిపోగా.. అదే సమయంలో 1000 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

Train Accidents: గత 40 ఏళ్లలో దేశంలో జరిగిన ఘోర రైలు ప్రమాదాలివే.. అతి పెద్ద ప్రమాదం ఏదంటే?
Coromandel Express Train Ac
Follow us on

Coromandel Express Train Accident: ఒడిశాలో శుక్రవారం రాత్రి 7.15 గంటలకు బహనాగ స్టేషన్ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో చోటు చేసుకుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. ప్రమాదంలో 278 మంది చనిపోగా.. అదే సమయంలో 1000 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ షాలీమార్‌ నుంచి చెన్నై వెళ్తోంది. మధ్యాహ్నం 3.20 సమయంలో అక్కడి నుంచి బయలుదేరింది. బహగాన స్టేషన్‌కు 7.15కి చేరుకుంది. ఆ సమయంలో పట్టాలు తప్పి లూప్‌ లైన్‌లో ఆగి ఉన్న గూడ్స్‌ను ఢీకొట్టింది. దాంతో ఇంజిన్‌తో పాటు 12 బోగీలు పక్క ట్రాక్‌పై ఒరిగిపోయాయి. ఇదే సమయంలో ఆ ట్రాక్‌పై యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ దూసుకొచ్చింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను ఢీకొట్టింది. యశ్వంత్‌పూర్‌- హౌరా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన నాలుగు జనరల్‌ బోగీలు ధ్వంసం అయ్యాయి. కోరమాండల్‌ ఎక్‌ప్రెస్‌కి మొత్తం 24 బోగీలు ఉంటే.. సగం బోగీలు ధ్వంసమయ్యాయి. అయితే, గత మూడు, నాలుగు దశబ్దాలుగా దేశంలో జరిగిన రైలు ప్రమాదాలను ఓసారి చూద్దాం..

  1. 1981 జూన్‌లో తుఫాను సమయంలో ఓ పాసింజర్ రైలు పట్టాలు తప్పి నదిలో పడిపోవడంతో సుమారు 800 మంది ప్రాణాలు కోల్పోయారు.
  2. 1988 జులైలో కేరళలోని పెరుముడి బ్రిడ్జిపై నుంచి ఆస్తముడి లేక్‌లో ఓ ఎక్స్ ప్రెస్ రైలు పడిపోవడంతో 106 మంది ప్రాణాలు కోల్పోయారు.
  3. 1995 ఆగస్టులో ఢిల్లీ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో రెండు రైళ్లు ఒకదానికొకటి ఢీ కొనడంతో 350 మంది ప్రాణాలు కోల్పోయారు.
  4. ఆగస్టు 1999 కోలకత్తా సమీపంలో జరిగిన ప్రమాదంలో 285 మంది ప్రాణాలు కోల్పోయారు.
  5. అక్టోబర్ 2005లో వెలిగొండలో జరిగిన ప్రమాదం గురించి మనందరికీ తెలిసిందే. ఈ ప్రమాదంలో 77 మంది ప్రాణాలు కోల్పోయారు.
  6. జులై 2011లో ఫతేపూర్‌లో జరిగిన ప్రమాదంలో సుమారు 70 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 300 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
  7. 2012 మేలో హంపి ఎక్స్‌ప్రెస్‌ (హుబ్బళ్లి-బెంగళూరు) ఏపీ సరిహద్దుల్లో గూడ్స్‌ రైలును ఢీ కొట్టిన ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోగా.. 43 మంది గాయాలపాలయ్యారు.
  8. 2014 మేలో ఉత్తర్‌ప్రదేశ్‌లో గోరఖ్‌పుర్‌ వెళ్తున్న గోరఖ్‌ధామ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆగి ఉన్న గూడ్స్‌ రైలును ఢీ కొట్టిన దుర్ఘటనలో 25 మంది చనిపోయారు. 50 మందికిపైగా గాయపడ్డారు.
  9. 2016 నవంబర్లో ఉత్తర ప్రదేశ్‌లో ఓ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో 146 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 200 మందికి గాయాలయ్యాయి.
  10. 2016 నవంబరులో ఇందౌర్‌-పాట్నా ఎక్స్‌ప్రెస్‌ కాన్పుర్‌లో సమీపంలో పట్టాలు తప్పడంతో 150 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 150 మంది గాయాలపయ్యారు.
  11. 2017 జనవరిలో ఏపీలోని విజయనగరం జిల్లా కూనేరు వద్ద హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు.
  12. 2017 ఆగస్టులో ఢిల్లీ వెళ్తున్న కైఫియత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉత్తరప్రదేశ్‌ సమీపంలో 9 బోగీలు పట్టాలు తప్పడంతో 70 మందికి గాయపడ్డారు.
  13. 2018 అక్టోబర్లో అమృత్ సర్ నగరం సమీపంలో ఓ ఫెస్టివల్ సందర్భంగా పెద్ద ఎత్తున జనం పట్టాలపైకి రావడం.. అదే సమయంలో ఓ రైలు దూసుకెళ్లడంతో ఏకంగా 59 మంది ప్రాణాలు కోల్పోగా మరో 57 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
  14. 2017 ఆగస్టులో ఉత్కళ్‌ ఎక్స్‌ప్రెస్‌ (పూరీ-హరిద్వార్‌) ముజఫర్‌నగర్‌ సమీపంలో పట్టాలు తప్పిన ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మంది గాయాలపాలయ్యారు.
  15. 2022 జనవరిలో పశ్చిమ బెంగాల్ సమీపంలో బీకానేర్‌-గువాహటి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో.. 9 మంది ప్రాణాలు కోల్పోగా, 36 మంది గాయపడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..