AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మృతి మరో 40 మందికి గాయాలు…

ఒడిషాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. గంజాం జిల్లాలోని తప్తపనిఘాటి సమీపంలో ఈ తెల్లవారుజామున బ్రిడ్జిపై నుంచి బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది స్పాట్‌లోనే చనిపోయారు. 41 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు తిక్రి నుంచి బెర్హంపూర్‌ వెళ్తుండగా తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు లోయలోపడ్డ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక కార్యక్రమాలు చేపట్టారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు […]

ఒడిషాలో ఘోర రోడ్డు  ప్రమాదం.. 9 మృతి మరో 40 మందికి గాయాలు...
Anil kumar poka
|

Updated on: Jan 29, 2020 | 12:36 PM

Share

ఒడిషాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. గంజాం జిల్లాలోని తప్తపనిఘాటి సమీపంలో ఈ తెల్లవారుజామున బ్రిడ్జిపై నుంచి బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది స్పాట్‌లోనే చనిపోయారు. 41 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు తిక్రి నుంచి బెర్హంపూర్‌ వెళ్తుండగా తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

బస్సు లోయలోపడ్డ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక కార్యక్రమాలు చేపట్టారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని బెర్హంపూర్‌, దిగపహండి ఆస్పత్రులకు తరలించారు. అతివేగం, డ్రైవర్‌ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.