NRIs Rallies: అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీకి ఎన్‌ఆర్‌ఐల మద్దతు.. కార్లతో భారీ ర్యాలీ

|

Feb 07, 2022 | 2:35 PM

NRIs Rallies: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌ రాష్ట్రాలలో రాబోయే ఎన్నికలకు..

NRIs Rallies: అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీకి ఎన్‌ఆర్‌ఐల మద్దతు.. కార్లతో భారీ ర్యాలీ
Follow us on

NRIs Rallies:  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.  ఇక బీజేపీ కోసం ఎన్ఆర్ఐలు కూడా మద్దతు పలుకుతూ బీజేపీని గెలిపించాలని ర్యాలీ చేపట్టారు.  గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌ రాష్ట్రాలలో రాబోయే ఎన్నికలకు ముందు ప్రవాస భారతీయులు (NRI)లు భారతీయ జనతా పార్టీ (BJP)కి మద్దతుగా నిలిచారు. కార్యకర్త గౌరవ్ పట్వర్ధన్ యునైటెడ్ స్టేట్స్‌లోని సిలికాన్ వ్యాలీలో కార్ ర్యాలీ దృశ్యాలను ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. పలు కార్లను ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోస్టర్లతో అలంకరించారు. వారు బీజేపీ జెండాలు, భారత త్రివర్ణ పతాకాలను చేతబూనారు. అమెరికాలోని బే ఏరియాలో జరిగిన మెగా ర్యాలీకి సంబంధించిన మరో వీడియోను ‘NRIs4Bharat’ అనే ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేసింది. ముఖ్యంగా యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీకి మద్దతుగా ర్యాలీ నిర్వహించినట్లు ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. 2018 నవంబర్‌లో భారతీయ-అమెరికన్ మద్దతుదారులు, బీజేపీ విదేశీ స్నేహితుల యూఎస్‌ చాప్టర్‌గా ప్రసిద్ధి చెందారు. 2019లోకూడా మోడీని మళ్లీ ఎన్నుకోవాలని ఫోన్ కాల్స్‌, సోషల్ మీడియా ద్వారా ప్రచారం జోరుగా నిర్వహించారు.

కాగా, ఈ ఏడాది జనవరి 8న భారత ఎన్నికల సంఘం 5 రాష్ట్రాలైన గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఎన్నికల తేదీలను ప్రకటించింది . ఫిబ్రవరి 10, 2022 నుండి మార్చి 7, 2022 వరకు ఎన్నికలు జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు. ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 7 దశల్లో పోలింగ్‌ నిర్వహిస్తుండగా, మణిపూర్‌లో 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగనున్నాయి. రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటింటికి తిరిగి బీజేపీకి మద్దతునిచ్చేందుకు ఎన్నారైలు ఏకతాటిపైకి వచ్చి ఈ ర్యాలీలు చేపట్టారు.

 

 

ఇవి  కూడా చదవండి:

UP Elections 2022: ఉత్తరప్రదేశ్ ఊపందుకున్న ఎన్నికల సందడి.. నేటినుంచి పూర్తిస్థాయిలో ప్రచారంలోకి దిగుతున్న స్టార్ క్యాంపెయినర్స్!

West Bengal Politics: సెంటర్ వర్సెస్ బెంగాల్‌ పోరులో మరో ఎపిసోడ్.. అభివృద్ధిని అడ్డుకుంటున్నది ఎవరు?