ఎన్నార్సీ డెడ్‌లైన్ ప్రకటించిన అమిత్‌షా..ఎప్పుడంటే?

దేశవ్యాప్తంగా ఎన్నార్సీని అమలు చేస్తామని అమిత్ షా మరోసారి కుండ బద్దలు కొట్టారు. ఇటీవల అమిత్ షా పార్లమెంటు వేదికగా ఎన్సార్సీని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించిన దరిమిలా పలు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకంగా గళమెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం శాఖా మంత్రి మరోసారి ఎన్సార్సీ ఇంప్లిమెంటేషన్‌పై డెడ్‌లైన్ సహా మరోసారి ప్రకటన చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సోమవారం పలు సభల్లో ప్రసంగించారు బిజెపి అధినేత, కేంద్ర హోం మంత్రి […]

ఎన్నార్సీ డెడ్‌లైన్ ప్రకటించిన అమిత్‌షా..ఎప్పుడంటే?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 02, 2019 | 8:08 PM

దేశవ్యాప్తంగా ఎన్నార్సీని అమలు చేస్తామని అమిత్ షా మరోసారి కుండ బద్దలు కొట్టారు. ఇటీవల అమిత్ షా పార్లమెంటు వేదికగా ఎన్సార్సీని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించిన దరిమిలా పలు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకంగా గళమెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం శాఖా మంత్రి మరోసారి ఎన్సార్సీ ఇంప్లిమెంటేషన్‌పై డెడ్‌లైన్ సహా మరోసారి ప్రకటన చేశారు.

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సోమవారం పలు సభల్లో ప్రసంగించారు బిజెపి అధినేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఎన్సార్సీ అమలుపై వెనక్కి తగ్గేది లేదని ఆయన మరోసారి ప్రకటించారు. 2024 నాటికి దేశవ్యాప్తంగా ఎన్సార్సీని అమలు చేసి, దేశంలో అక్రమంగా చొరబడి, జీవిస్తున్న వారిని వారి దేశాలకు తిప్పి పంపుతామని వెల్లడించారు అమిత్ షా.

దేశంలోనికి పలు దేశాల పౌరులు అక్రమంగా ప్రవేశించి, ఇక్కడి గుర్తింపు కార్డులు పొంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పొందుతున్నారని అమిత్ షా వివరించారు. ఇలాంటి వారిని తిప్పిపంపాలన్న కేంద్ర ప్రభుత్వ చర్యలను రాహుల్ బాబా (రాహుల్ గాంధీ), మమతాబెనర్జీ లాంటి వారు అడ్డుకుంటున్నారని అమిత్ షా ఆరోపించారు. ఈ దేశం నిధులతో ఈ దేశ పౌరులే లాభ పడాలన్న మోదీ ప్రభుత్వ ఉద్దేశాన్ని మతాలకు సంబంధించిన అంశంగా విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.

వచ్చే నాలుగున్నరేళ్ళలో ఎన్సార్సీని అమలు చేస్తామని, ఆ తర్వాత విదేశీయులను తిప్పి పంపుతామని అమిత్ షా జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. కాగా, దేశవ్యాప్తంగా ఎన్నార్సీ అమలు చేస్తామంటూ ఇటీవల అమిత్ షా ప్రకటించిన తర్వాత జరిగిన బెంగాల్ ఉప ఎన్నికల్లో బిజెపి దారుణంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

Latest Articles