లోక్‌సభను నివ్వెర పరిచిన బిజెపి ఎంపీ..ఇంతకీ ఏమన్నారంటే?

దేశ ఆర్థిక పరిస్థితిపై పార్లమెంటులో ఇంటరెస్టింగ్ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా లోక్‌సభలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్, తదితర విపక్షాలు జిడిపి గణాంకాలను సభలో ప్రస్తావిస్తూ మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాయి. ఈ సందర్భంలో బిజెపి ఎంపీ ఒకరు చేసిన కామెంట్లు సభలోని ఎంపీలతోపాటు పాలక పక్షాన్ని కూడా నివ్వెర పరిచాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జిడిపి).. దేశ ఉత్పాదక శక్తిని దీని ఆధారంగానే అంఛనా వేస్తారు. ఉత్పాదక శక్తి, మార్కెట్ ధరలు, […]

లోక్‌సభను నివ్వెర పరిచిన బిజెపి ఎంపీ..ఇంతకీ ఏమన్నారంటే?
Follow us

|

Updated on: Dec 02, 2019 | 5:18 PM

దేశ ఆర్థిక పరిస్థితిపై పార్లమెంటులో ఇంటరెస్టింగ్ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా లోక్‌సభలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్, తదితర విపక్షాలు జిడిపి గణాంకాలను సభలో ప్రస్తావిస్తూ మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాయి. ఈ సందర్భంలో బిజెపి ఎంపీ ఒకరు చేసిన కామెంట్లు సభలోని ఎంపీలతోపాటు పాలక పక్షాన్ని కూడా నివ్వెర పరిచాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?

గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జిడిపి).. దేశ ఉత్పాదక శక్తిని దీని ఆధారంగానే అంఛనా వేస్తారు. ఉత్పాదక శక్తి, మార్కెట్ ధరలు, సరఫరా సామర్థ్యం వంటి అంశాల ఆధారంగా దేశం ఆర్థికంగా బలంగా వుందా లేదా అన్నది తేల్చడం రివాజుగా మారింది. అయితే, గత ఏడేళ్ళ కనిష్ట స్థాయికి జిడిపి పడిపోవడం, ప్రస్తుతం జిడిపి 4.5 శాతంగా స్థిరపడడంపై విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇది మోదీ ప్రభుత్వ వైఫల్యమేనని ఎండగడుతున్నాయి.

ఈ విషయంలో సోమవారం లోక్‌సభను కుదిపేసింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో బిజెపి ఎంపీ నిశికాంత్ దూబే కూడా పాల్గొన్నారు. పాల్గొనడం వరకు బాగానే వున్నా.. జిడిపి అనేది 1934లోనే ప్రవేశపెట్టారని, అంతకు ముందు అది లేనే లేదని వింత వ్యాఖ్యలు చేశారు బిజెపి ఎంపీ. జిడిపినే రామాయణం, మహాభారతం, బైబిలూ అన్నట్లు భావించడం సరికాదని, అది లేకుండా దేశ ఆర్థిక పరిస్థితి బాగానే వుంటుందని అర్థం పర్థం లేని కామెంట్లను బిజెపి ఎంపీ చేయడంతో సభికులంతా నిర్ఘాంతపోయారని సమాచారం.

ఆర్థిక పరిస్థితిని అంఛనా వేయడానికి ఒక కొలమానంగా గత ఏడు దశాబ్ధాలుగా అందరూ భావిస్తుంటే.. నిశికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు తెలిసి చేసినవా లేక తెలియక చేసినవా అని అధికార పార్టీ నేతలు తలలపట్టుకుంటున్నట్లు సమాచారం.

ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ