Indian Passport Services: పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్…పేప‌ర్‌లెస్‌ పథకాన్ని ప్రారంభించిన కేంద్రం

|

Feb 20, 2021 | 9:28 PM

పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారికి ఇది గుడ్ న్యూస్. ఎందుకంటే పాస్​పోర్ట్​ దరఖాస్తు చేసుకునేందుకు ఓ కొత్త పథకాన్ని ప్రారంభించింది భారత విదేశాంగ మంత్రిత్వశాఖ.

Indian Passport Services: పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్...పేప‌ర్‌లెస్‌ పథకాన్ని ప్రారంభించిన కేంద్రం
Follow us on

Indian Passport: పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారికి ఇది గుడ్ న్యూస్. ఎందుకంటే పాస్​పోర్ట్​ దరఖాస్తు చేసుకునేందుకు ఓ కొత్త పథకాన్ని ప్రారంభించింది భారత విదేశాంగ మంత్రిత్వశాఖ. దీని ద్వారా ఎలాంటి పేపర్లు లేకుండానే ఆన్​లైన్​ ద్వారా అప్లికేషన్ చేసుకోవాడానికి వీలవుతుంది. ఈ మేరకు కావాల్సిన ప‌త్రాల కోసం డిజిలాక‌ర్‌ను అనుమ‌తించింది.

విదేశాంగ సహాయ మంత్రి వి.మురళీధరన్ ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు. దీని ద్వారా పాస్‌పోర్ట్ కోసం ఎక్క‌డైనా దరఖాస్తు చేసుకునేందుకు అవ‌స‌ర‌మైన ప‌త్రాల కోసం డిజిలాక‌ర్‌ను అనుమ‌తించింది. డిజిలాక‌ర్‌లో ఉన్న డాక్యుమెంట్ల‌ను ధ్రువీక‌ర‌ణ కోసం ఉప‌యోగించ‌వ‌చ్చు.

డిజిలాక‌ర్ పత్రాలకు లింక్ ఇలా చేయాలి..

ఈ సదుపాయంతో పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులు డిజిలాకర్ ద్వారా అవసరమైన వివిధ పత్రాలను కాగిత‌ర‌హిత విధానంలో సమర్పించగలుగుతారు. అప్పుడు ఒరిజిన‌ల్ డాక్యుమెంట్ల‌ను తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. డిజిటల్ ఇండియా ల‌క్ష్యంలో భాగంగా డిజిలాక‌ర్ ఒక‌ కీలకమైన చొరవ. ఇది ఎక్క‌డైనా అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్ల‌ను డిజిట‌ల్ రూపంలో అందించి మీ వివ‌రాల‌ను ధ్రువీక‌రించేందుకు దోహ‌ద‌ప‌డుతుంది.

పేపర్‌లెస్ పద్దతి‌..

డిజిట‌ల్ ఇండియాలో భాగంగా డిజిలాకర్ అనేది డిజిటల్ రూపంలో డాక్యుమెంట్లను జారీ చేయడానికి, ధ్రువీకరించడానికి మంచి వేదిక ఇది‌. పాస్‌పోర్ట్‌లు కూడా డిజిలాకర్‌లో అప్‌లోడ్ చేస్తే, వినియోగదారులకు అధికారికంగా అవ‌స‌ర‌మైన వివ‌రాలు సులభంగా అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఒక‌వేళ‌ పాస్‌పోర్ట్ పోతే ఇది చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. గత 6 సంవత్సరాల్లో పాస్‌పోర్ట్ సంబంధిత సేవల్లో చాలా మెరుగుదల ఉందని ఎంఈఏ తెలిపింది.

పాస్‌పోర్ట్ జారీలో డిజిటల్…

ఇ-పాస్‌పోర్ట్‌ను రూపొందించాలని మంత్రిత్వ శాఖ ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త పద్దతితో మరింత సెక్యూరిటీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. విదేశీ విమానాశ్రయాలలో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియల సౌకర్యాన్ని మెరుగుపరుస్తున్నారు. రాబోయే పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ V2.0 లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల ఉపయోగం, చాట్-బోట్, అనలిటిక్స్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (RPA) మొదలైనవి పాస్‌పోర్ట్ సేవ‌ల‌ను సులభతరం చేయడానికి, వేగవంతమైన సేవల‌కు సహాయపడతాయని తెలిపింది.

ఇవి కూడా చదవండి..

Monkey Viral Video: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కోతి చేసిన పని.. ఇలా కూడా చేస్తాయా అంటూ నెటిజన్ల కామెంట్స్

Post Office Scheme: పోస్టాఫీసులో రోజూ రూ . 411 జమ చేయడం.. ఆ తర్వాత రూ .43.60 లక్షలు పొందండి..