60ఏళ్ల తర్వాత అక్కడి అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లో జాతీయ గీతాన్ని ఆలపించారు.. ఇంతకు అది ఎక్కడో తెలుసా..
నాగాలాండ్ రాష్ట్ర హోదా పొందిన దాదాపు 60 సంవత్సరాల తరువాత, ఫిబ్రవరిలో మొదటిసారి జాతీయ గీతాన్ని అసెంబ్లీ ఆలపించారు. అక్కడ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ఫిబ్రవరి 12 న గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రసంగంతో ప్రారంభమైంది.
Nagaland : నాగాలాండ్ రాష్ట్ర హోదా పొందిన దాదాపు 60 సంవత్సరాల తరువాత తరువాత అసెంబ్లీలో భారతదేశపు జాతీయ గీతం ‘జనగణమన’ను ఆలపించిన అరుదైన ఘటన జరిగింది. చరిత్రలో తొలిసారి నాగాలాండ్ అసెంబ్లీలో జనగణమన ప్రతిధ్వనించటం విశేషం. ఫిబ్రవరి 12న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీని ఉద్దేశిస్తూ ప్రసంగించారు. ఆ ప్రసంగానికి ముందు నాగాలాండ్ అసెంబ్లీలో తొలిసారి జాతీయ గీతాన్ని ఆలపించారు.
నాగాలాండ్ రాష్ట్రం 1963, డిసెంబర్ 1 ఏర్పడింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకూ కూడా అసెంబ్లీలో జాతీయ గీతాన్ని ఎవరూ ఆలపించలేదు. దీనికి కారణాలు ఏమైనాగానీ తాజాగా మొదలైన అసెంబ్లీ సమావేశాల్లో జనగణమణ గీతం మారు మ్రోగింది. స్పీకర్ షేరింగ్ లాంగ్‌కుమెర్ మాట్లాడుతూ.. “గవర్నర్ సభను ఆరాధించినప్పుడు గీతం పాడటం సముచితం. ఇతర అసెంబ్లీలో కూడా అదే జరుగుతుంది. జాతీయ గీతాలాపన చేయాలని నేను సూచించాను దాంతో ప్రభుత్వం నా అభిప్రాయాలను ఆమోదించింది ”అని లాంగ్‌కుమెర్ అన్నారు.
అసెంబ్లీ కమీషనర్, కార్యదర్శి డాక్టర్ పీజే ఆంథోనీ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రవేశపెట్టిన కొత్త సాంప్రదాయాన్ని అసెంబ్లీ సభ్యులు మనస్ఫూర్తిగా స్వాగతించారని తెలిపారు. నిజానికి ఈశాన్య రాష్ట్రాలైన నాగాల్యాండ్, మణిపూర్, మిజోరంలో ఎక్కువ శాతం హిందీ భాష రానివారే ఉన్నారు. ఆ రాష్ట్రాల్లో ఉన్న వారిలో ఎక్కువ శాతం మంది క్రిస్టియన్లే ఉంటారు. నాగాలాండ్ రాష్ట్రంలో ఏడు జిల్లాలున్నాయి. రాష్ట్ర జనాభాలో దాదాపు 84 శాతము ప్రజలు 16 నాగా తెగలకు చెందినవారే. నాగాలు ఇండో-మంగోలాయిడ్ జాతికి చెందిన వారు. ఇంకా..చిన్ ప్రజలు 40,000 దాకా ఉన్నారు. వీరితోపాటూ 220,000 అస్సామీలు, 14,000 బెంగాళీ ముస్లింలు ఉన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
క్లైమేట్ ఛేంజ్ యాక్టివిస్ట్ దిశారవి బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా, 23 న ఢిల్లీ కోర్టు తీర్పు