Tirath Singh Rawat: మా రాష్ట్రంలో కమీషన్లు ఇవ్వకుంటే ఏ పనీ జరగదు.. బీజేపీ నేత, మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు..

|

Nov 15, 2022 | 5:55 AM

ఆయన ఆ రాష్ట్రానికి మాజీ సీఎం.. కానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా రాష్ట్రంలో కమీషన్లు ఇవ్వనిదే ఏదీ జరగదంటూ కామెంట్‌ చేశారు. ఇప్పుడా వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.

Tirath Singh Rawat: మా రాష్ట్రంలో కమీషన్లు ఇవ్వకుంటే ఏ పనీ జరగదు.. బీజేపీ నేత, మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు..
Tirath Singh Rawat
Follow us on

నిజం.. చెప్పాలంటే చాలా ధైర్యముండాలి. వాస్తవానికి నిజాన్ని నిర్భయంగా ఒప్పుకునేందుకు.. ఉన్నది ఉన్నట్లు చెప్పేందుకు ఎవరూ ముందుకు రారు.. కానీ ఈ మాజీ సీఎం మాత్రం నిజాన్ని నిజాయితీగా అంగీకరించారు. ఒకప్పుడు సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి.. నిస్సందేహంగా నిజాన్ని ఒప్పుకోవడమంటే మామూలు విషయం కాదు. తాజాగా.. బీజేపీ సినీయర్ నాయకుడు ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం తీరత్‌సింగ్‌ రావత్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కమిషన్లు ఉన్నట్టు ఆయన అంగీకరించారు. కమిషన్‌ ఇస్తేనే తమ రాష్ట్రంలో పని జరుగుతుందని సంచలన కామెంట్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి విడిపోయే టైమ్‌లో 20శాతం కమిషన్లు ఇవ్వాల్సి వచ్చేది. ఆ తర్వాతైనా తగ్గాల్సింది పోయి.. కమిషన్లు 20శాతం నుంచి ప్రారంభమయ్యాయి. ఇందుకు ఎవరు బాధ్యులో తాను చెప్పలేనంటూ పేర్కొన్నారు. తాజాగా.. ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఉత్తరాఖండ్ మాజీ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ వైరల్ అవుతోంది.

బీజేపీ సీనియర్‌ లీడర్‌ తీరత్‌ సింగ్‌ రావత్‌ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతేడాది మార్చిలో మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ తర్వాత అమెరికా మన దేశాన్ని 200 ఏళ్లు పాలించిందంటూ విమర్శలపాలయ్యారు.

తాజాగా, మరోసారి.. కమిషన్లు లేనిదే ఉత్తరాఖండ్‌లో ఏ పనీ జరగదంటూ తీరత్‌ సింగ్‌ రావత్‌ చేసిన వ్యాఖ్యలు బీజేపీని ఇరకాటంలో పడేశాయి. దీనిపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. విచారణ జరిపించాలంటూ విపక్ష నేతలు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..