AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పార్లమెంటులో ‘ ట్రంప్ ‘ ! ‘ కాశ్మీరం ‘ పై దుమారం

కాశ్మీర్ సమస్య పరిష్కారంలో ప్రధాని మోదీ తన మధ్యవర్తిత్వం కోరారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మంగళవారం పార్లమెంటును కుదిపివేశాయి. దీనిపై ప్రతిపక్షాలు ఇదే అదనుగా మోదీ ప్రభుత్వం పై విరుచుకపడ్డాయి. భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యమేమిటని దుయ్యబట్టాయి. మోదీ స్వయంగా సభలో దీనిపై ప్రకటన చేయాలని, ఇది నిజమో, కాదో స్పష్టం చేయాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యులు పట్టుబట్టారు. సభ్యుల నినాదాలు, గందరగోళం మధ్య విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్.. […]

పార్లమెంటులో ' ట్రంప్ ' ! ' కాశ్మీరం ' పై దుమారం
Pardhasaradhi Peri
|

Updated on: Jul 23, 2019 | 4:05 PM

Share

కాశ్మీర్ సమస్య పరిష్కారంలో ప్రధాని మోదీ తన మధ్యవర్తిత్వం కోరారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మంగళవారం పార్లమెంటును కుదిపివేశాయి. దీనిపై ప్రతిపక్షాలు ఇదే అదనుగా మోదీ ప్రభుత్వం పై విరుచుకపడ్డాయి. భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యమేమిటని దుయ్యబట్టాయి. మోదీ స్వయంగా సభలో దీనిపై ప్రకటన చేయాలని, ఇది నిజమో, కాదో స్పష్టం చేయాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యులు పట్టుబట్టారు. సభ్యుల నినాదాలు, గందరగోళం మధ్య విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్.. ఈ అంశంపై వివరణ ఇస్తూ.. ట్రంప్ ను మోదీ అలా అభ్యర్థించనే లేదని అన్నారు. పాకిస్తాన్ తో మన దేశానికి గల అన్ని అంశాల పరిష్కారం ఈ రెండు దేశాల మధ్యే ఉంటుందని. మూడో పక్షం మాటే తలెత్తదని ఆయన చెప్పారు. ఈ మేరకు అయన ఉభయసభల్లోనూ ప్రకటన చేస్తూ.. తమ మధ్య గల ద్వైపాక్షిక సమస్యలను భారత-పాకిస్థాన్ దేశాలు సంయుక్తంగా పరిష్కరించుకుంటాయి తప్ప మరో దేశ జోక్యం ఉండదన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ స్వస్తి చెప్పేంతవరకు ఆ దేశంతో చర్చల ప్రసక్తే లేదని జయశంకర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్ ప్రాధాన్యతను సభ్యులు గుర్తుంచుకోవాలని అయన పేర్కొన్నారు. కానీ ఈ వివరణతో విపక్ష సభ్యులు సంతృప్తి చెందలేదు. మోదీ నిజంగా ట్రంప్ ని ఈ మేరకు కోరారా అంటూ కాంగ్రెస్ సహా టీఎంసీ, ఇతర ప్రతిపక్షాల సభ్యులు పెద్దఎత్తున రభసకు దిగారు. మోదీ స్వయంగా పార్లమెంటులో ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు.ఆయన క్లారిటీ ఇవ్వాల్సిందేనని, అంతవరకు తాము శాంతించే ప్రసక్తి లేదని అంటూ వారు పోడియాన్ని చుట్ట్టుముట్టారు. ఇటీవల జపాన్లోని ఒసాకాలో జరిగిన జీ-సమ్మిట్ సందర్భంగా మోదీ, ట్రంప్ మధ్య జరిగిన భేటీని ప్రతిపక్షాలు గుర్తు చేశాయి. కాగా- లోక్ సభలో వారు వాకౌట్ చేయగా..రాజ్యసభలో వారి నిరసనలతో సభ రెండు సార్లు వాయిదా పడింది. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యమివ్వాలని తమ పార్టీ సభ్యులను కోరారు. వాషింగ్టన్ పర్యటనలో ఉన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో ట్రంప్ భేటీ అయినప్పుడు ఈ ‘ సంచలన ‘ వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత వైట్ హౌస్ వర్గాలు దీనిపై వివరణ ఇస్తూ ట్రంప్ అలా అనలేదని, భారత, పాకిస్తాన్ దేశాలు కాశ్మీర్ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని మాత్రమే కోరారని పేర్కొన్నాయి.