
Central Government Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పని దినాలను తగ్గిస్తున్నరంటూ వస్తోన్న వార్తలపై మోదీ గవర్నమెంట్ స్పందించింది. వారానికి 4 రోజుల పనిదినాలు లేదా 40 పని గంటలను అమలు చేసే ప్రతిపాదనను అమలు చేసే ఆలోచన ప్రస్తుతం ప్రభుత్వానికి లేదని కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానాన్ని ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పని దినాలు, సెలవులపై కేంద్ర వేతన సంఘం తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
నాలుగో వేతన సంఘం సిఫార్సు మేరకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో వారానికి 5 పని దినాలు, రోజుకు ఎనిమిదిన్నర పని గంటలను అమలు చేస్తున్నామని.. ప్రస్తుతం కొనసాగుతోన్న ఏడో వేతన సంఘం కూడా ఇదే పంధాను యధాతధంగా కొనసాగించవచ్చునని సిఫార్సు చేసిందని కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ వెల్లడించారు.
కసితో వేటాడిన సింహం.. మెరుపు దాడి చేసిన అడవి దున్న.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..
పోర్న్ చూస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన బాలుడు.. కిమ్ ఏం శిక్ష వేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!