కోవిడ్ పై ఆందోళన వద్దు, అనవసర భయాలతో చేటు, ప్రజలకు కేంద్రం హెచ్చరిక

కోవిద్ పై ఆందోళన వద్దని, అనవసర భయాల వల్ల మేలు కన్నా కీడే ఎక్కువగా జరుగుతుందని కేంద్రం ప్రజలను హెచ్చరించింది. ఇప్పుడు ప్రధాన సమస్య ఆక్సిజన్ కొరత అని, దీన్ని అధిగమించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొంది.

కోవిడ్ పై ఆందోళన వద్దు, అనవసర భయాలతో చేటు,  ప్రజలకు కేంద్రం హెచ్చరిక
No Panic On Covid Says Centre

Edited By: Phani CH

Updated on: Apr 26, 2021 | 6:31 PM

కోవిద్ పై ఆందోళన వద్దని, అనవసర భయాల వల్ల మేలు కన్నా కీడే ఎక్కువగా జరుగుతుందని కేంద్రం ప్రజలను హెచ్చరించింది. ఇప్పుడు ప్రధాన సమస్య ఆక్సిజన్ కొరత అని, దీన్ని అధిగమించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొంది. అయితే దీన్ని ఆసుపత్రులకు రవాణా చేయడం పెద్ద సమస్యగా మారిందని తెలిపింది. దేశంలో పలు ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసి ఉన్నాయని, అయితే చాలామంది రోగులు భయంతో  తమ పడకలను వదలడం లేదని, వారు డాక్టర్ల సలహా ప్రకారం నడుచుకోవాలని హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. కొనుగోలు ద్వారానో, అద్దె రూపంలోనో ఇండియా విదేశాల నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లను తెప్పించుకుంటోందని ఆయన వెల్లడించారు. కానీ వీటి రవాణా ప్రధాన సమస్యగా మారిందన్నారు. ఆయా హాస్పిటల్స్ ఆక్సిజన్ ని హేతు బద్ధంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. తమకు అవసరమైన దానికన్నా ఎక్కువ కావాలని కొన్ని ఆస్పత్రులు  కోరడం వల్ల ఇది అత్యంత అవసరమైన ఆసుపత్రులకు సమస్య ఏర్పడుతుందని ఆయన వివరించారు.

భౌతిక దూరం పాటించకపోతే ఒక వ్యక్తి 30 రోజుల్లో 406 మందికి వైరస్ ను వ్యాప్తి చెందింప జేయగలుగుతాడని పరిశోధనల ద్వారా తెలుస్తోందన్నారు . కోవిడ్ ప్రొటొకాల్స్ ను పాటించడం మనకే మంచిదని, నిర్లక్ష్యం వల్ల కూడా ఇంతటి తీవ్రమైన పరిస్థితి ఏర్పడిందని భావిస్తున్నామని కేంద్రం అభిప్రాయపడింది. ఏమైనా ఈ తరుణంలో మన దేశానికి సాయపడేందుకు అనేక దేశాలు ముందుకు వస్తున్నాయని వెల్లడించింది.  ఇక ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం వివిధ ఉత్పాదక సంస్థలను కోరినట్టు  పేర్కొంది. ఢిల్లీ ఆసుపత్రుల్లో పరిస్థితి మెల్లమెల్లగా మెరుగుపడుతోందని  తెలిపింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Polavaram Project: పోలవరానికి మరో 333 కోట్లు.. విడుదలకు కేంద్రం సుముఖం.. ఇంకా రావాల్సిందెంత?

West Bengal Election 2021 Phase 7 Voting LIVE: ప్రశాంతంగా ఏడో విడత పోలింగ్.. కోల్‌కతాలో ఓటేసిన సీఎం మమతా బెనర్జీ