కర్నాటక కథ ‘సుఖాంత మైంది. తన రాజీనామాను ఎవరూ కోరలేదని, ఈ రాష్ట్ర సీఎం ఎడ్యూరప్ప తెలిపారు. ఆరోగ్య కారణాలపై తాను రాజీనామా చేస్తానని బీజేపీ నేతలకు చెప్పానని వచ్చిన వార్తలు నిరాధారమన్నారు. పార్టీ అధ్యక్షుడు జె.పీ.నడ్డాకు తనపై మంచి అభిప్రాయం ఉందని, రాష్ట్రంలో పార్టీ పటిష్టత గురించి తాము చర్చించామని ఆయన చెప్పారు. గత రెండు రోజులుగా ఎడ్యూరప్ప ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో ఆయన బహుశా రాజీనామా చేయవచ్చునన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అయన నిన్న ప్రధాని మోదీతో కూడా భేటీ అయ్యారు. అయితే కర్ణాటకలో జరగనున్న ఎన్నికల గురించి, పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం గురించి తాను మోదీ తోనూ, నడ్డాతోను చర్చించినట్టు ఆయన వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించి అధికారంలోకి రావాలని నడ్డా కోరారని ఆయన చెప్పారు. రాష్ట్ర శాసన సభ ఎన్నికలు 2023 లో జరగవలసి ఉంది. కాగా రాష్ట్రంలో యెడ్యూరప్ప నాయకత్వాన్ని మార్చాలని అసమ్మతి వర్గం కొన్ని వారాలుగా గట్టిగా కోరుతోంది. ఆయన అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడుతున్నారని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలే బాహాటంగా విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి యెడ్యూరప్ప ఢిల్లీకి రావడంతో ఈ ఊహాగానాలు మరింత బలం పుంజుకున్నాయి. మొత్తానికి ఆయన నాయకత్వానికి ఢోకా లేదని స్పష్టమైంది. రాష్టానికి సంబంధించిన సమస్యలను పార్టీ నేతలకు వివరించేందుకు తాను తరచూ ఢిల్లీకి వస్తుంటానని, మళ్ళీ వచ్చే నెలలో కూడా ఇక్కడికి వస్తానని ఆయన చెప్పారు. అనవసరమైన ఊహాగానాలను నమ్మవద్దని ఆయన మీడియాను కోరారు.
మరిన్ని ఇక్కడ చూడండి : అంతరిక్షంలో ఆస్ట్రోనాట్స్ ఏమి తింటారు?వ్యోమగాముల రెగ్యులర్ లైఫ్ ఏంటి..:astronauts eat in space video.