Corona Virus: ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ఎయిమ్స్ బృందం.. ఇక థర్డ్ ముప్పు లేనట్లే… అయితే నిర్లక్ష్యం వద్దంటూ సూచన

|

Nov 24, 2021 | 9:43 PM

Corona Virus Third Wave: అగ్రరాజ్యం అమెరికా, యూరోపియన్ దేశాలు, రష్యా సహా అనేక దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ నుంచి మనదేశానికి ఉపశమనం లభించిందని వైద్య నిపుణులు..

Corona Virus: ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ఎయిమ్స్ బృందం.. ఇక థర్డ్ ముప్పు లేనట్లే... అయితే నిర్లక్ష్యం వద్దంటూ సూచన
Corona Virus Third Wave
Follow us on

Corona Virus Third Wave: అగ్రరాజ్యం అమెరికా, యూరోపియన్ దేశాలు, రష్యా సహా అనేక దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ నుంచి మనదేశానికి ఉపశమనం లభించిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సెకండ్ వేవ్ ఉధృతి నుంచి బయటపడిన తర్వాత గత కొన్ని రోజులుగా కొత్త కేసులు నమోదు తగ్గుముఖం పట్టాయి. ఇక దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా శరవేగంగా జరుగుతుంది. అయితే కరోనా వైరస్ రోజుకో రూపం సంతరించుకోవడంతో.. అందరూ థర్డ్ వేవ్ ముప్పు అని భయపడ్డారు. అయితే భారత్ లో కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చే అవకాశం కనిపించడం లేదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు.

ఓ వైపు వ్యాక్సినేషన్.. మరోవైపు 98.32శాతం రికవరీ రేటుతో జనాల్లో యాంటీబాడీలతో థర్డ్ వేవ్ ముప్పు భారత్ కు తప్పినట్లేనని అంటున్నారు. వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నవారు నిర్లక్ష్యం వీడి వెంటనే రెండో డోసు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే మనం టీకా తో కరోనా నుంచి రక్షణ పొందామని.. కనుక ఇప్పటి వరకూ టీకా తీసుకొని వారు వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని గులేరియా సూచిస్తున్నారు.

కాలక్రమేణా కరోనా మహమ్మారి సాధారణ వ్యాధిగా మారుతుందని చెప్పారు. అయితే ఇప్పటికే తీసుకున్న వ్యాక్సిన్ డోసులు కరోనా వైరస్ నుంచి రక్షణ ఇస్తున్నాయని.. ప్రస్తుతానికి వ్యాక్సిన్ బూస్టర్ డోస్ లేదా మూడవ డోస్ అవసరం లేదని చెప్పారు. ఈ మహమ్మారి అంతరించిపోలేదు.. ఇక భవిష్యత్తులో ఇది అంతరించిపోదని.. అయితే సాధారణ  మారవచ్చని ఆయన అన్నారు.

కోవిడ్-19కి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటం ప్రపంచ దేశాలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.  దేశ వ్యాప్తంగా గత ఏడాదిన్నర కాలంలో శాస్త్రవేత్తలు, ప్రభుత్వం, ప్రజల తాము చేసిన పనిలో స్పష్టత, చిత్తశుద్ధి ఉందని చెప్పారు.  ప్రజలకు, ప్రభుత్వానికి మహమ్మారి పాఠం చెప్పిందని.. ఆరోగ్య సౌకర్యాలను బలోపేతం చేయడానికి కారణమయ్యింది చెప్పారు.

అయితే ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా 4, 5వేవ్ లు వస్తున్నాయని.. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉంటేనే కరోనా వేవ్ రాకుండా అడ్డుకోవచ్చని స్పష్టం చేసింది. కాబట్టి ప్రజలు థర్డ్ వేవ్ ప్రమాదం లేదు కదా అని నిర్లక్ష్యంగా ఉండొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొత్త వేరియంట్ ముప్పు.. చలికాలం కారణంగా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

Also Read: ఆడ ఏనుగుకి పువ్వులు ఇస్తూ.. ప్రపోజ్ చేసిన ఏనుగు.. మాకు ఇలాంటి ప్రపోజల్ కావాలి అంటున్న నెటిజన్లు..

 శాఖాహార పాలు అంటే ఏమిటి.. వాటిల్లో రకాలు.. ఉపయోగాలు..