AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govt Jobs: ఆందోళనలు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు బంద్.. రోడ్లపై ధర్నా చేసినా అంతే.. ఎక్కడో తెలుసా..?

ఆందోళనలు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు రావు.. రోడ్లపై నిరసనలకు దిగినా.. ధర్నాల్లో కూర్చున్న ఇక అంతే సంగతులు.. పైగా ప్రభుత్వ కాంట్రాక్టులు కూడా దక్కవు.. అంటూ

Govt Jobs: ఆందోళనలు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు బంద్.. రోడ్లపై ధర్నా చేసినా అంతే.. ఎక్కడో తెలుసా..?
Shaik Madar Saheb
|

Updated on: Feb 03, 2021 | 1:26 PM

Share

Bihar Police issues new circular: ఆందోళనలు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు రావు.. రోడ్లపై నిరసనలకు దిగినా.. ధర్నాల్లో కూర్చున్న ఇక అంతే సంగతులు.. పైగా ప్రభుత్వ కాంట్రాక్టులు కూడా దక్కవు.. అంటూ యువకులను హెచ్చరిస్తోంది బీహార్ ప్రభుత్వం. తాజాగా బీహార్ పోలీసులు విడుదల చేసిన ఈ ఉత్తర్వులు వివాదస్పదంగా మారాయి. ఈ మేరకు బీహార్‌ డీజీపీ ఎస్‌కే సింఘాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. హింసాత్మక నిరసనలకు దిగడం, ధర్నాలు చేయడం, వివాదాస్పద సంఘటనల్లో పాల్గొనడం లాంటి చర్యలకు పాల్పడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు రావని, వారికి ఎలాంటి ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కవనీ ఈ ఉత్తర్వుల్లో హెచ్చరించారు. ఒకవేళ నిరసనల్లో హింస జరిగితే ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న వారి సర్టిఫికెట్లల్లో రిమార్క్‌ రాస్తారని డీజీపీ కార్యాలయం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇదిలాఉంటే.. ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియా పోస్టులు పెట్టేవారిపై కూడా కఠిన చర్యలు చేపడతామని బీహార్‌ పోలీసులు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఉత్తర్వులు కూడా వివాదాస్పదమయ్యాయి. దీనిపై ఆర్జేడీ నేత, బీహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందంటూ ట్విట్ చేశారు.

Also Read:

ఢిల్లీ హింసాకాండపై పోలీసుల నజర్.. దీప్ సిధు ఆచూకీ వెల్లడిస్తే రూ.లక్ష రివార్డు.. మరికొంత మందిపై కూడా..

రాజ్యసభలో ఎంపీలపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సీరియస్.. ఫోన్లు వాడొద్దంటూ ఆగ్రహం..