Chidambaram Temple: తమిళనాడులోని (Tamilnadu) ప్రముఖ పుణ్యక్షేత్రం చిదంబరం నటరాజస్వామి ఆలయం మళ్ళీ వార్తల్లో నిలిచింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దంపతులు కడలూరు జిల్లా చిదంబరంలోని నటరాజ పెరుమాళ్ ఆలయాన్ని సందర్శించారు. తిరుమంజనం మహాభిషేకంలో పాల్గొన్నారు. స్వామివారి తీర్థప్రసాదాలను తీసుకున్న తమిళసై శమీ దర్శనం అనంతరం ఐరంగల్ మండపంలో కూర్చున్నారు. అయితే.. ఇక్కడ కూర్చోవద్దు, లేచి వెళ్లండి అని దీక్షిథర్ ఒకరు తమిళిసైతో అన్నట్లు వార్తలు వినిపించాయి. అంతేకాదు దీక్షితులు తమిళ సమాజాన్ని అవమానించారనే పుకార్లు షికారు చేస్తున్నాయి.
ఇదే విషయంపై గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. చిదంబరం ఆలయంలో తనకు ఎలాంటి అగౌరవం కలగలేదని చెప్పారు. స్వామివారి సన్నిధి సమీపం లోని మందిరం మెట్ల మీద కూర్చోకూడదని ఒక దీక్షితులు చెప్పారు. నేను ఇక్కడే కూర్చుంటాను అన్నాను. దీంతో ఆ దీక్షితులు అక్కడ నుంచి వెళ్లిపోయారు.. మిగిలిన దీక్షితులు అందరూ నా దగ్గరకు వచ్చి ప్రసాదం ఇచ్చారు. దీక్షితార్ చెప్పిన దాన్ని నేను సీరియస్‌గా తీసుకోలేదు. తనను దీక్షితులు అగౌరవ పరిచారని వస్తున్న వార్తల్లో నిజం లేదని.. అవన్నీ తప్పుడు వార్తలంటూ తమిళిసై వివరించారు. తాను చిదంబర స్వామిని కోవిడ్ రహిత దేశం కోసం ప్రార్థించానని తెలిపారు. నటరాజస్వామి ఆలయ వివాదాలు త్వరలోనే తీరిపోవాలని అన్నారు. భక్తులకు దర్శనాల విషయం లో ఎటువంటి ఆటంకం ఉండకూడదు. పవిత్ర పుణ్యక్షేత్రం లో వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం , దీక్షితులు మంచి నిర్ణయం తీసుకోవాలని సూచించారు తమిళిసై..
Blessed to take part in Nataraja Temple’s Aani Thirumanjanam Mahabhisekham in Chidambaram.
Amidst thousands of devotees, prayed for COVID free nationசிதம்பரம் அருள்மிகு ஸ்ரீநடராஜர் திருக்கோவிலில் நடைபெற்ற ஆனி திருமஞ்சனம் மஹாபிஷேகம் விழாவில் கலந்து கொண்டு இறைவனை தரிசனம் செய்தேன் pic.twitter.com/3b4RRR4JsY
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) July 6, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..