సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా రేషన్ పంపిణీ కుంభకోణం కేసులో ఓ టీఎంసీ నేత ఇంట్లో సోదాలు చేసేందుకు వెళ్లిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్(ఈడీ) అధికారులపై దాదాపు 100 మంది టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారు. ఈడీకి చెందిన వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో ఈడీ అధికారులు గాయపడ్డారు. ఈ దాడి ఘటన నేపథ్యంలో ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఉత్తర కొరియా అధ్యక్షుడు, నియంత కిమ్ పేరు మార్మోగుతోంది. ఈడీ అధికారులపై దాడి ఘటనపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీని బీజేపీ టార్గెట్ చేసింది. ఉత్తర కొరియాలో కిమ్ తరహా నియంతృత్వ పాలనను మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌లో నడుపుతున్నారంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ధ్వజమెత్తారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం కనిపించడం లేదని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో హత్యలు జరిగినా అదేమీ కొత్త విషయం కాదని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ కూడా అంటున్నారని గుర్తు చేశారు. మమతా బెనర్జీ చెబుతున్న ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించారు.
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కామెంట్స్..
#WATCH | Patna, Bihar: On attack on ED team in West Bengal today, Union Minister Giriraj Singh says, “There is nothing like democracy in West Bengal. There seems to be a Kim Jong government there. Adhir Ranjan has said that it would not be new even if there is a murder… This is… pic.twitter.com/JS9PgJ68Jo
— ANI (@ANI) January 5, 2024
కాగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో 2019 ఫలితాలను రిపీట్ చేయాలని బీజేపీ అగ్రనేతలు ఉవ్విళ్లూరుతున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలోని మొత్తం 42 స్థానాల్లో 35 స్థానాల్లో విజయం సాధించాలని ఇటీవల ఆ రాష్ట్రంలో పర్యటించిన హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి లక్ష్యాన్ని నిర్దేశించారు.