కేజ్రీవాల్ విజయం.. నితీష్ మూడు ముక్కల పదం
ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్, ఆయన పార్టీ ఘన విజయంపై వ్యాఖ్యానించేందుకు బీహార్ సీఎం, జేడీ-యు అధినేత నితీష్ కుమార్ నిరాకరించారు. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన.. చేతులు జోడించి.. ‘జనతా మాలిక్ హై’ (ప్రజలే నేతలు) అన్నారు. డిప్యూటీ సీఎం బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీతో కలిసి ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో నితీష్ కుమార్ పాల్గొన్నారు. నితీష్ నేతృత్వంలోని జేడీ-యు పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి రెండు నియోజకవర్గాల్లో పోటీ […]
ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్, ఆయన పార్టీ ఘన విజయంపై వ్యాఖ్యానించేందుకు బీహార్ సీఎం, జేడీ-యు అధినేత నితీష్ కుమార్ నిరాకరించారు. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన.. చేతులు జోడించి.. ‘జనతా మాలిక్ హై’ (ప్రజలే నేతలు) అన్నారు. డిప్యూటీ సీఎం బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీతో కలిసి ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో నితీష్ కుమార్ పాల్గొన్నారు.
నితీష్ నేతృత్వంలోని జేడీ-యు పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసింది. (నితీష్ స్వయంగా మూడు చోట్ల ప్రచారం నిర్వహించారు). అయితే రెండు నియోజకవర్గాల్లోనూ జేడీ-యు ఓడిపోయింది. కేజ్రీవాల్ ను ఎదుర్కొనేందుకు బీజేపీ.. తన ఈ మిత్రపక్షంతో చేతులు కలపడం ఇదే మొదటిసారి. ఇలా ఉండగా.. బీహార్ బయట జేడీ-యు బీజేపీతో చేతులు కలపరాదని రాజకీయ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హెచ్చరించారు. ముఖ్యంగా ఢిల్లీ ఎన్నికల్లో ఈ పోకడను సహించబోనన్నారు. సీఏఏ, ఎన్నార్సీ ల విషయంలో నితీష్, పీకే మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. పీకే వైఖరిపై ఆగ్రహం చెందిన నితీష్ జేడీ..యు నుంచి ఆయనను బహిష్కరించారు.