కాంగ్రెస్ పని ఖతం.. చాకో ఆగ్రహం.. రాజీనామా

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నిరాశ చెందిన పార్టీ ఇన్-ఛార్జ్ పీసీ.చాకో రాజీనామా చేశారు. మాజీ ఎంపీ , సీనియర్ నేత కూడా అయిన చాకో.. ఈ ఎలక్షన్స్ లో పార్టీ ఓడిపోవడానికి దివంగత సీఎం షీలా దీక్షిత్ కారణమని ఆరోపించారు. (1998-2013 మధ్య షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంగా వ్యవహరించారు). కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అంతా ఇప్పుడు ఆప్ చేతుల్లోకి వెళ్లిపోయిందని చాకో పేర్కొన్నారు. 2013 లో షీలా దీక్షిత్ సీఎం అయినప్పటినుంచి పార్టీ […]

కాంగ్రెస్ పని ఖతం.. చాకో ఆగ్రహం.. రాజీనామా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 12, 2020 | 2:59 PM

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నిరాశ చెందిన పార్టీ ఇన్-ఛార్జ్ పీసీ.చాకో రాజీనామా చేశారు. మాజీ ఎంపీ , సీనియర్ నేత కూడా అయిన చాకో.. ఈ ఎలక్షన్స్ లో పార్టీ ఓడిపోవడానికి దివంగత సీఎం షీలా దీక్షిత్ కారణమని ఆరోపించారు. (1998-2013 మధ్య షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంగా వ్యవహరించారు). కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అంతా ఇప్పుడు ఆప్ చేతుల్లోకి వెళ్లిపోయిందని చాకో పేర్కొన్నారు.

2013 లో షీలా దీక్షిత్ సీఎం అయినప్పటినుంచి పార్టీ పతనం ప్రారంభమైందని ఆయన అన్నారు. కొత్త పార్టీ అయిన ఆప్ మాత్రం కాంగ్రెస్ ఓటు బ్యాంకును చేజిక్కించుకుందన్నారు.  దాన్ని తిరిగి తీసుకోలేమన్నారు. అయితే ముంబైకి చెందిన పార్టీ నేత మిలింద్ దేవర.. చాకో వ్యాఖ్యలతో విభేదించారు. మరణించిన షీలా దీక్షిత్ పేరును వివాదంలోకి ఎందుకు లాగుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఆమె పార్టీకి, ఢిల్లీ ప్రజలకు తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. నిజానికి షీలా అధికారంలో ఉండగా..కాంగ్రెస్ ఓ వెలుగు వెలిగిందని మిలింద్ దేవర అభిప్రాయపడ్డారు.