Nithyananda: ఆ పురాతన శైవ మఠానికి తదుపరి పీఠాదిపతి నేనే.. చర్చనీయాంశంగా మారిన నిత్యానంద ప్రకటన
అత్యంత పురాతనమైన శైవ పీఠాల్లో ఒక్కటైన మధురై అధీనంపై వివాదాస్పద స్వామి నిత్యానంద రాసిన బహిరంగ లేఖ తమిళనాట చర్చనీయాంశంగా మారింది. శతాబ్ధాల చారిత్రక నేపథ్యం కలిగిన మధురై అధీన మఠానికి తదుపరి పీఠాధిపతిని తానేనంటూ నిత్యానంద తనకు తానుగా ప్రకటించుకున్నారు.
Nithyananda: అత్యంత పురాతనమైన శైవ పీఠాల్లో ఒక్కటైన మధురై అధీనంపై వివాదాస్పద స్వామి నిత్యానంద రాసిన బహిరంగ లేఖ తమిళనాట చర్చనీయాంశంగా మారింది. శతాబ్ధాల చారిత్రక నేపథ్యం కలిగిన మధురై అధీన మఠానికి తదుపరి పీఠాధిపతిని తానేనంటూ నిత్యానంద తనకు తానుగా ప్రకటించుకున్నారు. ఆ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ పోస్టింగ్ చేశారు. మధురై ఆధీనం పీఠాధిపతి అరుణగిరి నాథన్ గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత అనారోగ్యంతో మదురైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తమిళనాడులోని అత్యంత పురాతనమైన మఠాల్లో మధురై ఆధీనం కూడా ఒకటి. ఆ మఠానికి 292వ పీఠాధిపతిగా 1980 సంవత్సరం నుంచి అరుణగిరి నాథన్ సేవలందిస్తున్నారు. గతంలో మధురై అధీనం అరుణగిరి నాథన్‌తో నిత్యానందకు సన్నిహిత సంబంధాలుండేవి. ఆధీనాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకొని మఠం ఆస్తులని, విలువైన మరకత లింగాన్ని అక్రమంగా తరలించినట్టు కొన్నేళ్ల క్రితం వీడియోలు భయపడడంతో నిత్యానంద అధీనాన్ని వదిలి వెళ్లారు.
మధురై ఆధీనంకు నిత్యానంద యువ పీఠాధిపతిగా 2012 ఏప్రిల్ 27న అరుణగిరి నాథన్ ప్రకటించారు. అప్పట్లో ఆ ప్రకటనపై తీవ్ర దుమారంరేగడంతో తన ప్రకటనను ఆయన ఉపసంహరించుకున్నారు. సుందరమూర్తి స్వామిని యువ పీఠాధిపతిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి స్వామి నిత్యానంద కోర్టును ఆశ్రయించగా…ప్రస్తుతం విచారణ కోర్టులో పెండింగ్‌లో ఉంది.
మధురై ఆధీనం పీఠాధిపతి అరుణగిరి నాథన్ పరిస్థితి మరింత విషమించిందన్న కథనాల నేపథ్యంలో తదుపరి అధీన పీఠాధిపతి ఎవరు అనే దానిపై శైవ పీఠాధిపతుల మధ్య చర్చ కొనసాగుతోంది. తాజాగా మధురై ఆధీనానికి తాను 293వ పీఠాధిపతినంటూ నిత్యానంద తనకు తాను ప్రకటించుకోవడం చర్చనీయాంశంగా మారింది. మఠానికి సంబంధించిన సర్వ హక్కులు, అధికారాలు, ఆధ్యాత్మిక సంపద, మతపరమైన గౌరవాలు, పూజా కార్యక్రమాల నిర్వహణ అర్హతలు తనకే చెందుతాయని నిత్యానంద తన లేఖలో పేర్కొన్నారు.
స్వామి నిత్యానంద లేఖతో అప్రమత్తమైన శైవ మఠాదిపతులు.. మదురై అధీన మఠాన్నీ మూసివేసి తాళాలు వేశారు. స్వామి నిత్యానందను మదురై ఆధీనం పీఠాధిపతిగా అంగీకరించే ప్రసక్తే లేదని వారు చెబుతున్నారు. మదురై ఆధీనం పీఠంకు భారీ ఎత్తున స్థిరాస్తులు ఉన్నాయి. కొన్ని ఆస్తులను కౌలుకు తీసుకున్న వారు తిరిగి ఇవ్వకపోవడంతో కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మధురై ఆధీనం పీఠాధిపతిగా తదుపరి ఎవరురానున్నారన్న అంశం తమిళనాడు చర్చనీయాంశంగా మారింది.
Also Read..
శ్రావణ శోభను సంతరించుకున్న ఆలయాలు.. పుట్టలో పాలు పోస్తున్న భక్తులు…నాగ పంచమి విశిష్టత ఏమిటంటే
రాధికా ఆప్టేను బహిష్కరించాలంటోన్న నెటిజన్లు. ట్రెండింగ్‌లో బైకాట్ రాధికా.. కారణమేంటో తెలుసా?