బ్రేకింగ్.. ఉరితీయకండంటూ సుప్రీం మెట్లెక్కిన మరో నిర్భయ దోషి

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచార ఘటన కేసులో దోషులుగా తేలిన నలుగురికి.. ఢిల్లీలోని పాటియాలా కోర్ట్ ఉరిశిక్ష విధించిన తెలిసిందే. ఈ జనవరి 22న ఉదయం 7.00 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే వీరిలో ఒక దోషి వినయ్‌ కుమార్‌ శర్మ.. ఉదయం సుప్రీంకోర్టులో క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఉరిశిక్షపై స్టే విధించాలని పిటిషన్‌ దాఖలు చేశాడు. అయితే గంటల వ్యవధిలోనే మరో దోషి […]

బ్రేకింగ్.. ఉరితీయకండంటూ సుప్రీం మెట్లెక్కిన మరో నిర్భయ దోషి
Follow us

| Edited By:

Updated on: Jan 09, 2020 | 10:33 PM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచార ఘటన కేసులో దోషులుగా తేలిన నలుగురికి.. ఢిల్లీలోని పాటియాలా కోర్ట్ ఉరిశిక్ష విధించిన తెలిసిందే. ఈ జనవరి 22న ఉదయం 7.00 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే వీరిలో ఒక దోషి వినయ్‌ కుమార్‌ శర్మ.. ఉదయం సుప్రీంకోర్టులో క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఉరిశిక్షపై స్టే విధించాలని పిటిషన్‌ దాఖలు చేశాడు. అయితే గంటల వ్యవధిలోనే మరో దోషి ముకేష్ సింగ్ కూడా క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. వీరిద్దరూ న్యాయపరంగా వారికున్న చివరి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు.

అయితే ఈ కేసులో దోషులుగా ఉన్న నలుగురు వ్యక్తులు.. ముఖేశ్‌(32), పవన్‌ గుప్తా(25), వినయ్‌ శర్మ(26), అక్షయ్‌ కుమార్‌ సింగ్‌(31)పై.. ఢిల్లీలోని పాటియాల కోర్టు అదనపు సెషన్స్‌ జడ్జి సతీశ్‌ కుమార్‌ అరోరా.. తాజాగా డెత్‌ వారంట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 14 రోజుల్లో దోషులు వారి న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవచ్చంటూ ఈ సందర్భంగా కోర్టు సూచించింది. దీంతో బుధవారం ఇద్దరు దోషులు ముఖేష్ సింగ్, వినయ్ శర్మ క్యూరేటివ్ పిటిషన్‌లను దాఖలు చేశారు.