Nipah Virus: హమ్మయ్యా.. అదుపులోకి వచ్చిన నిఫా వైరస్.. ఆంక్షలు సడలింపు

|

Sep 19, 2023 | 5:16 PM

కేరళలో నిఫా వైరస్ కలకలం రేపిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కేరళ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ నిఫా వైరస్ అదుపులోకి వచ్చింది. గత రెండురోజులుగా చూసుకుంటే ఇప్పటికీ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇటీవల నిఫా కేసులు పెరగడంతో అక్కడ కేరళ విపత్తు నిర్వహణ విభాగం కోజికోడ్‌ జిల్లాలో ఆంక్షలు కూడా విధించింది.

Nipah Virus: హమ్మయ్యా.. అదుపులోకి వచ్చిన నిఫా వైరస్.. ఆంక్షలు సడలింపు
Nipah Virus In Kerala
Follow us on

కేరళలో నిఫా వైరస్ కలకలం రేపిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కేరళ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ నిఫా వైరస్ అదుపులోకి వచ్చింది. గత రెండురోజులుగా చూసుకుంటే ఇప్పటికీ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇటీవల నిఫా కేసులు పెరగడంతో అక్కడ కేరళ విపత్తు నిర్వహణ విభాగం కోజికోడ్‌ జిల్లాలో ఆంక్షలు కూడా విధించింది. అయితే ఇప్పుడు నిఫా కేసులు అదుపులోకి రావడంతో ఈ సంక్షలను సడలించింది. అంతేకాదు ఈ వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని పాఠశాలలు, బ్యాంకులు, ఇతర కార్యాలయలాను కూడా మూసివేసింది. వైరస్‌ను కట్టడి చేసేందుకు అనేక చర్యలు చేపట్టింది. అయితే ఇప్పుడు క్రమంగా నిఫా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నెల 16వ తేదీ నుంచి వివిధ ప్రాంతాల్లో ఒక్క నిఫా వైరస్ పాజిటివ్ కేసు కూడా రాలేదు.

అయితే ఇప్పటిదాకా కాంటాక్ట్ లిస్టు జాబితాలో ఉన్నటువంటి 218 మంది శాంపిళ్లను పరీక్షించారు. అయితే అవన్నీ కూడా నెగటీవ్‌గానే వచ్చాయి. దీనివల్ల కోజికోడ్ జిల్లాలోని 53 వార్డులు అలాగే పంచాయతీల్లో ఆంక్షలను సడలించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ప్రకటన చేసింది. అంతేకాదు ఇకనుంచి కంటైన్‌మెంట్ జోన్లలో ఉన్నటువంటి దుకాణాలను రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉండవచ్చని పేర్కొంది. అలాగే మధ్యాహ్నం పూట 2 గంటల వరకు బ్యాంకు కార్యకలాపలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే మాస్కులు ధరించడం, శానిటైజర్లను ఉపయోగించడం, భౌతిక దూరం పాటించడం వంటి వాటిని మాత్రం యాథావిధిగా కొనసాగించాలని పేర్కొంది. అలాగే ప్రజలు గుమికూడే విషయంలో కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి నిబంధనలే అమలులో ఉంటాయని తెలిపింది.

తదుపరి ఉత్తర్వులను జారీ చేసేంతవరకు ఈ నిబంధనలు అమలులోనే ఉంటాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది. అలాగే నిఫా వైరస్ టెస్ట్ చేసుకొని ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవాళ్లు, అలాగే నిఫా వైరస్ సోకిన వారు కఠినమైన ఆంక్షాలు పాటించాల్సి ఉంటుందని చెప్పింది. ఇక ఆరోగ్య శాఖ సూచనల ప్రకారం క్వారంటైన్‌లో ఉండాలని కోజికోడ్ జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇదిలా ఉండగా.. మరోవైపు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్.. నిఫా వైరస్‌కు సంబంధించి ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో వార్డు ప్రతినిధులతో ఆమె సమావేశం కానున్నారు. అలాగే విద్యార్థుల ఆన్‌లైన్ తరగతుల నిర్వహణపై చర్చించేందుకూ కూడా విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి పలువురు అధికారులతో సమావేశం అవ్వనున్నారు. అయితే కేరళలో ఇప్పటి వరకు ఆరు నిఫా వైరస్ కేసులు నమోదు కాగా.. అందులో ఇద్దరు మృతి చెందారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..