Kerala Bus Accident: కేరళలో ఘోర రోడ్డుప్రమాదం.. ఆర్టీసీ బస్సు-టూరిస్టు బస్సు ఢీ.. 9 మంది మృతి, 45 మందికి గాయాలు

|

Oct 06, 2022 | 7:26 AM

వలయార్ వడకంచెరి ప్రాంతంలోని కొల్లతర బస్టాప్ సమీపంలో అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. మృతుల్లో కెఎస్‌ఆర్‌టిసి బస్సులో ముగ్గురు, టూరిస్ట్ బస్సులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. 

Kerala Bus Accident: కేరళలో ఘోర రోడ్డుప్రమాదం.. ఆర్టీసీ బస్సు-టూరిస్టు బస్సు ఢీ.. 9 మంది మృతి, 45 మందికి గాయాలు
Bus Accident
Follow us on

పండుగ పూట కేరళలో విషాదం నెలకొంది. విహారయాత్ర కాస్తా విషాదంగా ముగిసింది. పాలక్కాడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడకంచెరి జాతీయ రహదారిపై KSRTC బస్సు, టూరిస్ట్‌ బస్సు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 9మంది మృతి చెందగా..మరో 45మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో మరో 10మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎర్నాకుళానికి చెందిన ఓ బృందం ఊటీకి విహార యాత్రకు వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. టూరిస్ట్ బస్సులో ఐదుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు, కెఎస్‌ఆర్‌టిసి బస్సులోని ముగ్గురు ప్రయాణికులు మరణించారు. కేఎస్‌ఆర్‌టీసీ బస్సు వెనుక ప్రయాణిస్తున్న కొందరికి తీవ్ర గాయాలయ్యాయి.

వడకంచెరిలో జరిగిన ఘోర ప్రమాదానికి పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న టూరిస్ట్ బస్సు అతివేగమే కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అతివేగంతో వచ్చిన టూరిస్ట్ బస్సు కేఎస్‌ఆర్‌టీసీ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టి బోల్తాపడింది. దాన్ని ఢీ కొట్టిన తర్వాత పక్కకు వెళ్లి వాగులో పడింది. కెఎస్‌ఆర్‌టిసి బస్సును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. టూరిస్ట్ బస్సు ఇతర వాహనాలను ఓవర్ టేక్ చేసిందని ప్రత్యక్ష సాక్షులు కూడా చెబుతున్నారు. అది ఢీ కొట్టడంతో కేఎస్‌ఆర్‌టీసీ బస్సులో కొంత భాగం టూరిస్ట్ బస్సులో వెళ్లిపోయింది.

ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే టూరిస్ట్ బస్సులో ఉన్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించడం కష్టమైంది. వాహనాన్ని కట్ చేసి చాలా మందిని బయటకు తీశారు. కొందరు ప్రమాద స్థలంలోనే మృతి చెందారు.

ఎర్నాకులం మూలంతురుట్టి వెట్టికల్‌లోని మార్ బసేలియస్ విద్యానికేతన్ పాఠశాల నుంచి ఊటీకి 42 మంది విద్యార్థులు, ఐదుగురు ఉపాధ్యాయులతో వెళ్తున్న టూరిస్ట్ బస్సు కేఎస్‌ఆర్‌టీసీ బస్సును ఢీకొని బోల్తా పడింది. మొత్తం 45 మంది గాయపడ్డారు. 12 మంది పరిస్థితి విషమంగా ఉంది.

వలయార్ వడకంచెరి ప్రాంతంలోని కొల్లతర బస్టాప్ సమీపంలో అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. మృతుల్లో కెఎస్‌ఆర్‌టిసి బస్సులో ముగ్గురు, టూరిస్ట్ బస్సులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదాల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని పోలీసులు తెలిపారు. 28 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను పాలక్కాడ్ జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం