Bus Fire Accident: అయ్యో ఎంత ఘోరం! కదులుతున్న బస్సులో అకస్మాత్తుగా చలరేగిన మంటలు.. 9 మంది సజీవ దహనం

|

May 19, 2024 | 9:57 AM

పంజాబ్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. లూథియానా, హోషైర్‌పూర్‌కు చెందిన కొందరు భక్తులతో వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. హర్యానాలోని నుహ్ జిల్లా కుండ్లీ-మనేసర్-పల్వాల్‌ సమీపంలో తౌరులో కదులుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆరుగురు మహిళలతో సహా తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. శనివారం తెల్లవారుజామున ఈ ఘోర ఘటన చోటు చేసుకుంది..

Bus Fire Accident: అయ్యో ఎంత ఘోరం! కదులుతున్న బస్సులో అకస్మాత్తుగా చలరేగిన మంటలు.. 9 మంది సజీవ దహనం
Bus Fire Accident
Follow us on

చండీఘడ్‌, మే 19: పంజాబ్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. లూథియానా, హోషైర్‌పూర్‌కు చెందిన కొందరు భక్తులతో వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. హర్యానాలోని నుహ్ జిల్లా కుండ్లీ-మనేసర్-పల్వాల్‌ సమీపంలో తౌరులో కదులుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆరుగురు మహిళలతో సహా తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. శనివారం తెల్లవారుజామున ఈ ఘోర ఘటన చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో KMPలోని టౌరు సమీపంలో బస్సులో 60 మంది భక్తులతో వెళ్తున్న బస్సులో ఉన్నట్టుండి మంటలు వ్యాపించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

బస్సులోని వారంతా పంజాబ్‌లోని లూథియానా, హోషియార్‌పూర్‌కు చెందినవారిగా పోలీసు వర్గాలు తెలిపాయి. ఉజ్జన్, మధుర-బృందావనం సందర్శించి తిరిగి వస్తుండగా కదులుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో మంటలను చూసిన కొందరు స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ, అప్పటికే ఘోరం జరిగిపోయింది. తొమ్మిది మంది ఆ మంటల్లో సజీవ దహనమయ్యారు. దాదానె 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

బస్సులో మంటలు చెలరేగడం చూసిన స్థానికులు.. డ్రైవర్‌ను పిలిచి అప్రమత్తం చేశారు. కానీ బస్సు ఆగకపోవడంతో.. మోటర్‌సైకిల్‌పై బస్సును వెంబడించి డ్రైవర్‌కు సమాచారం అందించామని, బస్సు ఆపాలని డ్రైవర్‌ను కోరామని తెలిపారు. అయితే అప్పటికే మంటలు వ్యాపించాయని, బస్సులోపలకు కూడా మంటలు చేరినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మహిళలు, ముగ్గురు పురుషులు సహా మొత్తం తొమ్మిది మంది సజీవంగా దహన మయ్యారు. మరో 15 మంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. గాయపడిన వారంతా నిలకడగా ఉన్నారని, అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.