Noida:పెళ్లి పేరుతో 300 మంది భారతీయ మహిళలకు సైబర్ వరుడు వల.. యువతి ఫిర్యాదుతో వెలుగులోకి..

|

May 28, 2022 | 1:28 PM

తనను తాను కెనడాలో స్థిరపడిన ప్రవాస భారతీయుడిగా పరిచయం చేసుకొని, జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నట్లు వల విసురుతాడు.

Noida:పెళ్లి పేరుతో 300 మంది భారతీయ మహిళలకు సైబర్ వరుడు వల.. యువతి ఫిర్యాదుతో వెలుగులోకి..
Nigerian Cyber Groom
Follow us on

Noida: పెళ్లి పేరుతో దాదాపు 300 మంది భారతీయ మహిళలకు వల. బహుమతులు వీసాల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన నైజీరియా దేశస్థుడిని ఎట్టకేలకు నోయిడా సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నైజీరియాలోని లాగోస్‌ ప్రాంతానికి చెందిన గరుబా గలుంజే (38) దక్షిణ ఢిల్లీలోని కిషన్‌గఢ్‌లో నివాసం ఉంటూ సోషల్ మీడియా, మ్యాట్రిమోని వెబ్‌సైట్ల ద్వారా యువతులతో స్నేహం చేసుకుంటాడు. తనను తాను కెనడాలో స్థిరపడిన ప్రవాస భారతీయుడిగా పరిచయం చేసుకొని, జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నట్లు వల విసురుతాడు. అంతా ఒకే అనుకున్నాక, ఆర్థిక సంబంధాలు మొదలు పెట్టి సొమ్ము కొల్లగొడుతాడు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ జిల్లాలో నివాసం ఉంటున్న ఓ యువతి ఫిర్యాదుతో నిందితుడి మోసం బయటపడింది. ‘జీవన్‌ సాథీ’ వివాహ వెబ్‌సైటులో ఈమె కూడా తన పేరు నమోదు చేసుకొంది. ఈ వెబ్‌సైటు ద్వారా ఆమెకు పరిచయమైన వ్యక్తి ఇండో – కెనడియన్‌ అయిన తన పేరు సంజయ్‌సింగ్‌‌గా పరిచయం చేసుకున్నాడు. ఆమెను నమ్మించిన ఆ వ్యక్తి… పలు దఫాలుగా 60 లక్షల రూపాయల మేర వివిధ బ్యాంకు ఖాతాలకు జమ చేయించుకున్నాడు. చివరికి తాను మోసపోయినట్లు యువతి ఆలస్యంగా తెలుసుకుని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. అందిన ఫిర్యాదు మేరకు కూపీ లాగడంతో నైజీరియన్‌ గుట్టు రట్టయి అరెస్టు చేసినట్లు నోయిడా పోలీసులు తెలిపారు. విచారణలో ఇలా దాదాపు 300 మంది మహిళలను అతడు మోసం చేసినట్లు తేలింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి