NIA Raids Nellore: నెల్లూరులో(Nellore) ఎన్‌ఐఏ(NIA) సోదాలు కలకలం రేపుతోంది. నగరంలోని బాలాజీనగర్ పోలీస్‌స్టేషన్(Balaji Nagar PS) పరిధిలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేశారు. మావోయిస్టులకు నిధుల సమీకరణ కేసులో భాగంగా ఈ సోదాలు నిర్వహించింది ఎన్‌ఐఏ. ఏపీ, ఒడిశా, బిహార్, ఝార్ఖండ్‌లోని 26 ప్రాంతాల్లోనూ ఎన్‌ఐఏ బృందాలు ఆరా తీస్తున్నాయి. బిహార్‌లో ఈ మధ్య నమోదైన కేసు ఆధారంగా వచ్చిన సమాచారంతో సోదాలు చేశారు ఎన్‌ఐఏ అధికారులు. ఈ సోదాల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నెల్లూరులో ఎన్‌ఐఏ దాడులతో బాలాజీనగర్ వాసులు ఉలిక్కిపడ్డారు. తమ ప్రాంతంలోనూ మావో సానుభూతి పరులు ఉండడంపై భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడు ఎవరొచ్చి సోదాలు చేస్తారో..ఎవరొచ్చి ఏం అడుగుతారోనని వణుకుతున్నారు.
మావోలపై ఉక్కుపాదం మోపుతున్న కేంద్రం.. వారికి నిధుల సమీకరణ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మావోయిస్టులకు నిధులు సమీకరిస్తున్నారని బిహార్‌లో నమోదైన కేసు ఆధారంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు స్పీడు పెంచారు. ఏపీ సహా ఒడిశా, బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది ఎన్‌ఐఏ. ఇప్పటికే ఈ కేసులో అనుమానితుల నుంచి 3తుపాకులు, బోర్ రైఫిల్, 59 బుల్లెట్లు, డిజిటల్ పరికరాలు, కీలక డాక్యుమెంట్లు, 4 కిలోల మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకుంది ఎన్‌ఐఏ. తెలుగు రాష్ట్రాల్లోనూ మావోలకు నిధులు సమీకరణ జరుగుతోందన్ని సమాచారంతో దూకుడు పెంచింది. ఈ కేసులో చాలా రాష్ట్రాలకు చెందిన మావో సానుభూతిపరులు ఉన్నట్లు భావిస్తోంది ఎన్‌ఐఏ. దేశవ్యాప్తంగా అనుమానితుల జాబితాను సిద్ధం చేసింది. సోదాల్లో మావోలకు నిధులను సమీకరిస్తున్న అనుమానితులను ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుని విచారిస్తోంది ఎన్‌ఐఏ. సోదాల్లో మరింత మందిని అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also read:
GHMC: ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి జీహెచ్‌ఎంసీ షాక్.. ఫ్లెక్సీలను తొలగించనందుకు భారీగా జరిమానా..
Raviteja vs Rekha: స్టార్ హీరోపై డైరెక్ట్ భార్య సంచలన కామెంట్స్.. ఇంతకీ ఏం జరిగిందంటే..!