బెంగాల్ లో ఎన్నికల అనంతర హింస నిజమే.. జాతీయ మానవ హక్కుల సంఘం నిర్ధారణ.. మమత ఖండన

| Edited By: Phani CH

Jul 15, 2021 | 7:52 PM

బెంగాల్ లో ఎన్నికల అనంతర హింస నిజమేనని జాతీయ మానవ హక్కుల కమిషన్ తన నివేదికలో తెలిపింది. హింసకు గురైన అల్లర్ల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా ఉందని, వారి ఖర్మానికి వారిని వదిలివేసిందని పేర్కొంది.

బెంగాల్ లో ఎన్నికల అనంతర హింస నిజమే.. జాతీయ మానవ హక్కుల సంఘం నిర్ధారణ.. మమత ఖండన
Mamata Banerjee
Follow us on

బెంగాల్ లో ఎన్నికల అనంతర హింస నిజమేనని జాతీయ మానవ హక్కుల కమిషన్ తన నివేదికలో తెలిపింది. హింసకు గురైన అల్లర్ల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా ఉందని, వారి ఖర్మానికి వారిని వదిలివేసిందని పేర్కొంది. హత్యలు, అత్యాచారాలు వంటి నేరాలపై సీబీఐ దర్యాప్తు జరగాలని, ఈ కేసుల విచారణ రాష్ట్రం బయట కోర్టులు విచారించాలని సిఫారసు చేసింది.ఈ మేరకు ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. రాష్ట్రంలో పరిస్థితి ‘రూల్ ఆఫ్ లా ‘ బదులు ‘ మేనిఫెస్టెషన్ ఆఫ్ లా ఆఫ్ రూలర్’ (పాలకులు చెప్పిందే న్యాయం) మాదిరి ఉందని ఈ నివేదిక తెలిపింది. కలకత్తా హైకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులు రాష్ట్రంలోని పరిస్థితిని సమీక్షించి తమ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. విపక్ష బీజేపీ మద్దతుదారులపట్ల పాలక పార్టీ సపోర్టర్లు దాడులు జరిపారన్న ఆరోపణలకు మద్దతుగా వీరు తమ నివేదికలో ఆయా అంశాలను ప్రస్తావించారు. హింస కారణంగా వేలాది ప్రజల జీవితాలు, వారి ఆర్ధిక స్థితిగతులు దారుణంగా మారాయని, ఇప్పటికీ కొందరు నిర్వాసితులు తమ ఇళ్లకు చేరుకోలేకపోతున్నారని, పోలీసులంటే వారు భయపడుతున్నారని ఈ నివేదిక తెలిపింది.

లైంగిక నేరాలు జరిగినా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారని ఇందులో పేర్కొన్నారు. అయితే సీఎం మమతాబెనర్జీ ఈ రిపోర్టును ఖండిస్తూ..ఇదంతా బీజేపీ రాజకీయ కక్ష అని ఆరోపించారు. ఈ సభ్యులు మొదట ప్రభుత్వ అభిప్రాయాలను కూడా సేకరించి ఉండవలసిందన్నారు. ఈ రిపోర్టును మీడియాకు బీజేపీ లీక్ చేసిందని ఆమె ఆరోపించారు. ఈ సభ్యులు దీన్ని తొలుత కోర్టుకు సమర్పించాల్సి ఉండింది అని ఆమె వ్యాఖ్యానించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Breaking: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్‌కార్డుల పంపిణీకి తేదీ ఖరారు..

లడాఖ్ సరిహద్దుల్లో చైనా ‘బూచి’.. శరవేగంగా కాంక్రీట్ కట్టడాల నిర్మాణం.. రాహుల్ గాంధీ ఆందోళన నిజమేనా ?