Farmers’ Protest : ఈ నెల 15న మరోసారి రైతుసంఘాలతో చర్చలు జరుపుతామన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రైతులతో  కేంద్రం చేస్తున్న చర్చలు విఫలం అవుతున్నాయి.

Farmers Protest : ఈ నెల 15న మరోసారి రైతుసంఘాలతో చర్చలు జరుపుతామన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి..
Narendra Singh Tomar

Updated on: Jan 11, 2021 | 8:13 PM

Farmers’ Protest : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రైతుసంఘాలతో కేంద్రం చేస్తున్న చర్చలు విఫలం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతు సంఘాల నేతలతో మరోసారి చర్చలు ఈ నెల 15న జరుపుతామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.

వ్యవసాయ చట్టాల అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది అందువల్ల దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని తోమర్ అన్నారు. ఇక రైతుల నిరసనల పట్ల మొండిగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మరో వైపు వ్యవసాయ చట్టాలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయనున్నది. దీంతో సుప్రీంకోర్టు ఎలాంటి ఉత్తర్వులు జరీ చేస్తుందా అన్న ఉత్కంఠ నెలకొన్నది.

 మరిన్ని ఇక్కడ చదవండి : 

11th Instalment GST Released: 11వ విడత 6వేల కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల చేసిన కేంద్రం ప్రభుత్వం